ఇకపోతే ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై యాంకర్లుగా కొనసాగుతున్న అనసూయ, రష్మి లు వారి అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో సంపాదించుకున్నారు.ఇక ఇది వరకు ఉన్న వారి స్పీడ్ ఇక ముందు ఉండదేమో అని చాలా మంది భావిస్తున్నారు.
ఇక వారి కెరియర్ కేవలం చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి మాత్రమే అన్నటుగా కనిపిస్తుంది.అయితే దీనికి కారణం ఏంటంటే.
లాక్ డౌన్ నుండి సినిమాలు విడుదల కాకపోవడంతో చాలామంది సినీ అభిమానులు నిరుత్సాహ పడిపోయారు.అయితే, ఇటువంటి వారి కోసం చాలా మంది చిన్న నిర్మాతలు చిన్న హీరోలకు సంబంధించిన సినిమాలు ఎన్నో ఓటిటి ప్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకులకు దగ్గర అయ్యారు.
ఇందులో భాగంగానే చాలామంది హీరోలు హీరోయిన్లు ఒక్కొక్కరుగా బుల్లితెర, ఓటిటి ప్లాట్ ఫామ్ లో నటించాలని లేకపోతే ఎక్కడ ఏదైనా ప్రోగ్రాం లో పాల్గొనడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.దీంతో ప్రస్తుతం ఉన్న యాంకర్లు తర్వాత పరిస్థితి ఏంటి అని ఆలోచనలో పడ్డారు.

ప్రస్తుతం బుల్లితెరపై కి చిన్న స్థాయి హీరోలు హీరోయిన్ల నుండి టాప్ స్టార్ల వరకు చాలా మంది రావడానికి ఇష్టపడుతున్నారు.ఇదివరకు దగ్గుబాటి రానా, అలాగే మంచు లక్ష్మి లాంటివారు కాస్త హడావిడి చేయగా ప్రస్తుతం సమంత లాంటి హీరోయిన్లు కూడా వచ్చేస్తున్నారు.అందిన సమాచారం మేరకు త్వరలో దగ్గుబాటి రానా, అతని బాబాయ్ దగ్గుబాటి వెంకటేష్ లు కలిసి ఓ రియాల్టీ షో స్టార్ట్ చేయబోతున్నారు.వీరితో పాటు హీరో రామ్, అలాగే నిఖిల్ కూడా తెరపైకి రావడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
చూడాలి మరి వీరందరూ బుల్లితెరపై ప్రజలు అలరించడానికి వస్తే ప్రస్తుతం యాంకర్లుగా ఉన్నా అనసూయ, రష్మి, ప్రదీప్, రవి, శ్రీముఖి లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం అవ్వట్లేదు.అయితే వీళ్ళు అందరూ ఒక ఎత్తయితే సుమ మాత్రం చాలా సేఫ్.
దీనికి కారణం ఆవిడ కేవలం యాంకరింగ్ మాత్రమే కాకుండా నటన అలాగే, ఆవిడకు ఉన్న పాపులారిటీ షో ఇలా ఆవిడకు తిరుగులేకుండా తన స్థానాన్ని ఎక్కడో ఉంచుకుంది.ఒకవేళ ఎంతమంది హీరో హీరోయిన్లు బుల్లి తెర పై ప్రజలను అలరించడానికి వచ్చిన సుమను బీట్ చేయడం మాత్రం అంత సులువు కాదు.