సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తున్న టాలీవుడ్ హీరోయిన్... కానీ....

తెలుగులో ప్రముఖ దర్శకుడు రిషి దర్శకత్వం వహించిన "ప్రేమతో మీ కార్తీక్" అనే చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ సరసన హీరోయిన్ గా నటించి తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ "సిమ్రత్ కౌర్" గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే వచ్చీరావడంతోనే ఈ అమ్మడు పర్వాలేదనిపించినా ఎందుకో సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా అవకాశాలు మాత్రం దక్కించుకోలేక పోయింది.

 దీంతో ఎక్కువ కాలం తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగలేక పోయింది.అయితే ఈ మధ్యకాలంలో సిమ్రత్ కౌర్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు అందాల విందు చేస్తోంది.

ఈ క్రమంలో సిమ్రత్ కౌర్ కొంతమేర సినిమా అవకాశాల కోసం గ్లామర్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది. అంతేగాక తన పాత్రలకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశాలు వస్తే బోల్డ్ తరహా పాత్రలో అయినా సరే నటించడానికి సిద్ధమేనని అంటోంది ఈ బాలీవుడ్ బ్యూటీ.

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడికి బాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు లేకపోయినప్పటికీ టాలీవుడ్లో మాత్రం ఇటీవలే రెండు చిత్రాలలో నటించే అవకాశం తలుపు తట్టినట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తెలుగులో సిమ్రత్ కౌర్ "డర్టీ హరి" అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత మరియు దర్శకుడు "ఎమ్మెస్ రాజు" దర్శకత్వం వహిస్తున్నాడు.అలాగే నూతన హీరో శ్రవణ్ రెడ్డి హీరోగా నటిస్తున్నాడు.

 ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా లాక్ డౌన్ విధించగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులను తాత్కాలికంగా కొంత కాలం పాటు నిలిపి వేశారు.

Advertisement

తాజా వార్తలు