నడిరోడ్డుపై రేప్ చేస్తానంటూ కంగనాకు వార్నింగ్

బాలీవుడ్‌లో నిత్యం ఏదో ఓ వివాదంలో చిక్కుకునే బ్యూటీ కంగనా రనౌత్, ఇటీవల బాలీవుడ్ స్టార్స్‌ను వరుసగా టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తుండటంతో బాలీవుడ్‌లో చిన్నసైజ్ వార్ వాతావరణం నెలకొంది.ఇక మహారాష్ట్ర ప్రభుత్వంపై కూడా కంగనా పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో, ఇటీవల ఆమె ఆఫీస్‌ను కూల్చివేసిన ఘటన కూడా మనం చూశాం.

 Kangana Gets Rape Warning, Kangana Ranaut, Bollywood News, Rape, Warning-TeluguStop.com

అయితే కంగనా చేసే కామెంట్స్‌తో కేవలం సెలెబ్రిటీలు మాత్రమే కాకుండా సామాన్యులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీంతో వారు సదరు బ్యూటీపై ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా కంగనా తన సోదరుడి వివాహ పనుల్లో నిమగ్నమై ఉంది.ఈ క్రమంలో ఆమె తన సోదరుడి పెళ్లికి సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ ఫోటోలపై చాలామంది పాజిటివ్ కామెంట్స్ చేస్తుండగా, ఓ న్యాయవాది మాత్రం ఆమెను నడిరోడ్డుపై రేప్ చేస్తానంటూ వార్నింగ్‌కు దిగాడు.ఒడిశాకు చెందిన ఓ న్యాయవాది ‘కంగనా, నీ ఓవర్ యాక్షన్ చాలు.

లేకపోతే నడిరోడ్డుపై రేప్ చేస్తా’ అంటూ కామెంట్ చేశాడు.దీంతో అవాక్కయిన కంగనా, ఈ విషయంపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాగా సదరు లాయర్ మాత్రం తాను ఈ కామెంట్స్ చేయలేదని, ఎవరో తన సోషల్ అకౌంట్ హ్యాక్ చేసి ఇలాంటి చర్యకు పాల్పడ్డారని పేర్కొన్నాడే.ఏదేమైనా ఇటీవల సెలెబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులపై అత్యాచార బెదిరింపులు ఎక్కువవుతుండటంతో పోలీసులు వారికి రక్షణను కలిగిస్తున్నారు.

ఇక సినిమాల పరంగా కంగనా ప్రస్తుతం తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్ ‘తలైవి’లో ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను అతి త్వరలో రిలీజ్ చేసేందుకు కంగనా అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.

మరి ఈ సినిమాతో కంగనా మరోసారి వివాదానికి తెరలేపుతుందా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube