ఆ విషయంలో ధోనికి మద్దతుగా నిలిచిన పాకిస్థాన్ మాజీ ప్లేయర్ అఫ్రిది..!

మహేంద్రసింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

టీమిండియాకు అనేక గొప్ప విజయాలకు కెప్టెన్ గా వహించిన మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కు అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.

ప్రస్తుతం మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓటముల నేపథ్యంలో మహేంద్రసింగ్ ధోని కూతురు పై కొన్ని అసభ్యకరమైన కామెంట్స్ వచ్చిన నేపథ్యంలో తాజాగా మహేంద్ర సింగ్ ధోనికి మద్దతుగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది నిలిచాడు.

ఇకపోతే ఈ విషయంలో ఓ నెటిజన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ధోని కూతురుని ఉద్దేశించి అసభ్యకరమైన కామెంట్లు చేశాడు.నిజానికి ఈ పోస్టు ద్వారా ధోని అభిమానులు మాత్రమే కాకుండా క్రికెట్ అభిమానులు మొత్తం ఒకింత ఆందోళన పడ్డారు.

ఇక ఈ విషయంపై మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేశాడు.అందులో ధోనికి, అతని కుటుంబానికి ఎలాంటి బెదిరింపులు వచ్చాయో నాకు పూర్తిగా తెలియదు కానీ.

Advertisement

ఇలా చేయడం సరైన పద్ధతి కాదని తెలిపాడు.భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని, భారత క్రికెట్ ను ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళిన వ్యక్తి ధోని అంటూ తెలిపాడు.

మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియాలోని సీనియర్లు, జూనియర్ లను కలుపుకుని ముందుకు సాగిన విషయం అందరికీ తెలిసిందేనని అతనికి ఈ విధంగా జరగకూడదని అఫ్రిది ట్వీట్ పూర్వకంగా తెలిపారు.వీటితో పాటు మరో ట్వీట్ లో మహేంద్ర సింగ్ ధోని కెరియర్ ను అఫ్రిది కొనియాడాడు.

భారత క్రికెట్ కు సంబంధించి నిజమైన లెజెండ్స్ లో మహేంద్ర సింగ్ ధోని కూడా ఒకడని అలాగే ఒక గొప్ప కెప్టెన్ కూడా అని తెలిపాడు.వీటితో పాటు గొప్ప కెరియర్ సాధించిన మీకు అభినందనలు అని తెలుపుతూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ అని అఫ్రిది ధోని ఉద్దేశించి పోస్ట్ చేశాడు.

ఇకపోతే ధోని కుమార్తెపై అసభ్యకర కామెంట్లు చేసిన పదహారేళ్ల బాలుడిని తాజాగా అహ్మదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు