క్లాత్ మాస్క్ లు వాడుతున్నారా..జాగ్రత్త సుమా....

కరోనా వైరస్ అరికట్టేందుకు నిపుణులు,వైద్యులు, ఎన్ని మార్గాలు సూచిస్తున్నా,ఎన్ని జాగ్రత్తలు పాటించినా వైరస్ వ్యాపిస్తూ నే ఉండడం గమనార్హం.

ఈ నేపథ్యంలో క్లాత్ తో తయారు చేసిన మాస్కులను వాడుతున్న వారికి జాగ్రత్తలు సూచిస్తున్నారు.

కరోనా సోకకుండా తీసుకొంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో బాగంగా చాలా మంది క్లాత్ ఫేస్ మాస్క్ లు ధరిస్తున్నారు.మరికొందరు ఫేస్ షీల్డ్ లు కూడా వాడుతున్నారు.

వీటి గురించి పక్కన పెడితే ఆస్ట్రేలియా లోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ఒక ఆసక్తి కరమైన విషయాన్ని తెలిపింది.కరోనా నివారణకు క్లాత్ మాస్కులు,సర్జికల్ మాస్కులు ధరిస్తున్న వారిలో చాలా మంది క్లాత్ మాస్క్ లను వాష్ చేయకుండా పదే పదే వాడుతున్నారని తెలిసింది.

ఇలా వాష్ చేయకుండా రోజుల కొద్దీ మాస్క్ ల ను వాడితే కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ అధ్యయనంలో వెల్లడైంది.అంతే కాకుండా.

Advertisement

అదిక ఉష్ణోగ్రత నీటితో క్లాత్ మాకులను వాష్ చేయాలని,ఇలా బాగా వేడిగా ఉన్న నీటితో క్లాత్ మాస్క్ ల ను వాష్ చేసి ధరించడం వల్ల వైరస్ సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయని వెల్లడించింది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు