మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలు చేయడానికి రెడీ అయిపోయాడు.ప్రస్తుతం క్రాక్ సినిమా సెట్స్ పైన ఉండగానే రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాకి రెడీ అయిపోయి త్వరలో దానిని స్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు.
ఈ సినిమాకి సంబంధించి ప్రీప్రొడక్షన్వర్క్ అంతా పూర్తయ్యి షూటింగ్ కి సిద్ధమై ఉంది.వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
ప్రస్తుతం క్రాక్ సినిమా తమిళంలో సూపర్ హిట్ మూవీకి రీమేక్ అనే టాక్ వినిపిస్తుంది.అలాగే రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కూడా ఇంకా రిలీజ్ కానీ తమిళ సినిమా రీమేక్ అనే మాట వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే రవితేజ మారుతి, త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో కూడా రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు.అందులో మారుతి కథని రీసెంట్ గా విని ఖరారు చేసినట్లు సమాచారం.
సితార ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని నిర్మించబోతోంది అని టాక్.
ఇదిలా ఉంటే మారుతి సిద్ధం చేసిన కథ కూడా బాలీవుడ్ హిట్ మూవీ రీమేక్ అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.
ఇందులో రవితేజ క్రిమినల్ లాయర్ పాత్రలో కనిపించనున్నాడు అనే టాక్ వచ్చింది.నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావడంతో అక్షయ్ కుమార్ జాలీ ఎల్.ఎల్.బి 2కి ఇది రీమేక్ అని చెప్పుకుంటున్నారు.దానికి సంబందించిన రీమేక్ రైట్స్ ని గతంలో సితార వాళ్ళు సొంతం చేసుకున్నారు.ఇప్పుడు అదే కథకి రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ జోడించి కొత్త కథనంతో మారుతి సిద్ధం చేసాడని టాక్ వినిపిస్తుంది.
త్వరలో దీనికి సంబందించిన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.