పెళ్లి అయినా అది మాత్రం వదలనంటున్న కాజల్

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ దశాబ్ధ కాలానికిపైగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది.

కాజల్ తన అందంతో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను మెప్పి్స్తూ వస్తుండటంతో ఆమె యాక్టింగ్‌కు ప్రేక్షకులు పట్టం కట్టారు.

ఇక ఈ బ్యూటీ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ అక్కడి ప్రేక్షకుల మన్ననలు అందుకుంది.కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం పెళ్లి చేసుకునేందుకు రెడీ అయినట్లు వెల్లడించింది.

కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు గతంలోనే వార్తలు వచ్చినా వాటిని కొట్టిపారేసింది.అయితే ఇప్పుడు ఆమె స్వయంగా తన పెళ్లికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ముంబైకి చెందిన గౌతమ్ కిచ్చు అనే వ్యాపారవేత్తను కాజల్ పెళ్లాడబోతుందని వెల్లడించింది.అక్టోబర్ 30న వీరి వివాహం జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

ఇక కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందని చాలా మంది అనుకున్నారు.ఈ మేరకు పలు మీడియాల్లో కథనాలు కూడా వచ్చాయి.

అయితే ఈ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ కాజల్ తన పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తానంటూ చెప్పుకొచ్చింది.పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తూ స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్న వారు చాలా మంది ఉన్నారని, వారిలో ముఖ్యంగా సమంత లాంటి స్టార్ హీరోయిన్ కూడా ఉందని కాజల్ చెప్పుకొచ్చింది.

అలాంటి వారే తనకు స్పూర్తిగా నిలుస్తున్నారని, తన కొత్త జీవితాన్ని సంతోషంగా ప్రారంభించేందుకు కాజల్ రెడీ అవుతున్నట్లు తెలిపింది.మొత్తానికి పెళ్లి తరువాత కూడా కాజల్ పాప సినిమాలు చేస్తాననడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ప్రస్తుతం కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’లో హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు.

పుట్టినరోజున అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సింగర్ సునీత.. ఏం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు