ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.ట్రాక్టర్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త చెప్పింది.
ట్రాక్టర్లకు, ఇతర కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ వాహనాలకు వచ్చే ఏడాది వరకు బీఎస్ మినహాయింపులు ఇచ్చింది.బీఎస్ మినహాయింపుల వల్ల తక్కువ ధరకే ట్రాక్టర్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.
కేంద్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ట్రాక్టర్, ఇతర కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ వాహనాలపై బీఎస్ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది.
కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది.
కేంద్ర ప్రభుత్వం టూ వీలర్లైనా, ఫోర్ వీలర్లైనా బీఎస్ 6 వాహనాలను మాత్రమే వాడాలని 2020 ఏప్రిల్ 1 నుంచి నూతన నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది.కేంద్రం అమలు చేసిన ఈ నిబంధనల వల్ల బీఎస్ 4 వాహనాలను షోరూంలు విక్రయించడానికి వీలు లేకుండా పోయింది.
టూ వీలర్లపై ఆఫర్లు ఇచ్చి విక్రయాలు చేపట్టినా పెద్దపెద్ద వాహనాల విక్రయాలు మాత్రం జరగలేదు.
మరోవైపు బీఎస్ 4 వాహనాలకు, బీఎస్ 6 వాహనాలకు ధర విషయంలో చాలా తేడా ఉంది.
వినియోగదారులు బీఎస్ 6 వాహనాలను కొనుగోలు చేయాలంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తోంది.కేంద్రం తాజా నిర్ణయం వల్ల వినియోగదారులకు, కంపెనీలకు ప్రయోజనం చేకూరనుంది.
కేంద్రం కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ వాహనాలకు ఏప్రిల్ 2021 వరకు ట్రాక్టర్లకు 2021 అక్టోబర్ వరకు బీఎస్ నిబంధనలను సడలించింది.
వినియోగదారులు పాత ఉద్గార ప్రమాణాలు కలిగిన ట్రాక్టర్లను, కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ వాహనాలను తక్కువ మొత్తానికే కొనుగోలు చేయవచ్చు.
అయితే ఈ వాహనాల వల్ల కొత్త వాహనాలతో పోలిస్తే పర్యావరణ కాలుష్యం కొంత పెరుగుతుంది.అయితే బీఎస్ 6 వాహనాలతో పోలిస్తే ఈ వాహనాలు కొనుగోలు చేస్తే వేల రూపాయలు ఆదా అయ్యే అవకాశాలు ఉంటాయి.