సమంత.ఈ నటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఏమాయ చేసావే అంటూ సినిమా తీసి ప్రేక్షకులను అలరించిన ఈ భామ తన గ్లామర్ తో అందరిని ఆకట్టుకుంది.మొదట గ్లామర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఈ భామ తర్వాత నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకొని ప్రజలకు మరింత దగ్గరైంది.
ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్న సమంత అంత అందంగా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది.ఉదయం లేచిన సమయం నుంచి రాత్రి పడుకునే వరకు ఆరోగ్యం కోసం, అందం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది ఈ భామ.సమంత అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసి ఆశ్చర్యపరుస్తుంటుంది.
ఫిట్నెస్ కోసం ఆమె ఎన్నో వ్యాయామాలు చేస్తుంది.
వాటి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది.ఇక ఇప్పటికే అలా ఎన్నో ఫోటోలను పెట్టి ఆశ్చర్యానికి గురి చేసి సమంత ఉదయం లేవగానే ఏం చేస్తుందో తెలుసా? ఆమె రోజు ఉదయం 5 గంటలకు లేచి జాగింగ్ తో రోజును ప్రారంభిస్తుందట.

ఇక ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.సమంత అసలు ఏ మాత్రం డైటింగ్ చెయ్యదట.ఆమెకు నచ్చిన ఆహారాన్ని నచ్చిన సమయంలో తింటుంది.అయితే ఆ ఆహారం తిన్న తర్వాత దానికి తగ్గట్టు ఆమె వ్యాయామాలు చేసి బరువు తగ్గుతుంది.ఇక ఆరోగ్యం కోసం ఎక్కువ వాటర్ తాగుతున్నట్టు ఆమె తెలిపారు.
ఇక ఇటీవల ఆమె రోజు వ్యాయామాలకు సంబందించిన ఫోటోలను షేర్ చేసి అందరి ఆశ్చర్యపరిచారు.
నిన్నటికి నిన్న ఆమె ఓ ఫోటో షేర్ చేస్తూ ఇక ఇదే లాస్ట్ ఫోటో అంటూ కూడా చెప్పుకొచ్చారు.ఇలా వ్యాయామం చెయ్యడమేనండి సమంత బ్యూటీ సీక్రెట్.
మరి మీరు కూడా వ్యాయామం చేసి బాడీ ని ఫిట్ గా ఉంచుకోండి.