కరోనా వల్ల బంధాలు, బంధుత్వాలు మరిచి ఇంట్లో వాళ్లనే బయటకు గెంటేస్తున్న పరిస్థితులు నెలకొంటుంటే… మరోవైపు ఆడబిడ్డ పుట్టిందని చంపుకునే కసాయి తండ్రులు తయారవుతున్నారు.ఈ సమాజంలో ఆడవాళ్లకే భద్రత లేదనుకుంటే పుట్టిన పిల్లలకు కూడా జీవించే హక్కు లేకుండా పోతోంది.
కొందరూ వ్యక్తులు జంతువుల కంటే హీనంగా దినజారి బతుకుతున్నారు.కేంద్రం బేటీ బచావో- బేటీ పడావో వంటి పథకాలు తీసుకొచ్చినా వాటిన ఆచరణలో పెట్టడం మరిచారని పలువురు ఆరోపిస్తున్నారు.
ఆడపిల్ల పుట్టిందని ఓర్చుకోలేని ఓ కసాయి తండ్రి పాపను హత్య చేసి కవర్ చుట్టిలో నదిలో పడేసిన ఘటన కేరళ రాష్ట్రంలోని పచల్లూరులో చోటు చేసుకుంది.స్థానికులు గమనించడంతో నిందితుడిని పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న తిరువల్లం పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ఉన్నికృష్ణన్ అనే వ్యక్తి భార్య 40 రోజుల కిందట బాలికను జన్మించింది.బాలిక పుట్టిందని ఓర్చుకోలేక ఎలాగైనా పాపను చంపేయాలని ఉన్నికృష్ణన్ పన్నాగం పన్నాడు.
గురువారం రాత్రి అందరూ పడుకోవడంతో పాపను హత్య చేసి కవర్ లో చుట్టుకుని పచల్లూరు సమీపంలోని వల్లతిన్ కడావు ఒడ్డుకు చేరుకున్నాడు.పాప మృతదేహాన్ని ఒడ్డులో పడేశాడు.
అటువైపుగా ఓ వ్యక్తి రావడంతో ఉన్నికృష్ణన్ అనుమానాస్పదంగా ప్రవర్తించసాగాడు.దీంతో ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు.
ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరపగా.అసలు విషయం బయటపెట్టాడు.
ఈ మేరకు పోలీసులు, గజ ఈతగాళ్ల ఆధ్వర్యంలో పాప మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టంకు తరలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.