నవంబర్ 3 న జరగనున్న ఎన్నికల కోసం అమెరికా ప్రజలు వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు.ప్రపంచం మొత్తం ఆరోజున ప్రజలు ఎవరికి మద్దతు తెలుపనున్నారని కళ్ళప్పగించి చూడటానికి సిద్దంగా ఉంది.
గెలిచేది బిడెనా లేక ట్రంప్ న అనే కోణంలో చర్చలు జోరుగా జరుగుతున్నాయి.ప్రతిపక్షాలు ట్రంప్ ని అమెరికా ప్రజల ముందు అసమర్దుడిగా చిత్రీకరిస్తూ లబ్ది పొందలని చూస్తుంటే, తనకి ఎలాంటి అవకాశం దొరికినా వినియోగించుకుని అమెరికా ప్రజల మన్ననలు పొందాలను ట్రంప్ తహతహలాడుతున్నాడు.
అంతేకాదు ముఖ్యంగా భారతీయ అమెరికన్స్ ఓట్లు తనకే రావాలంటూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్ కి ఓ అద్భుతమైన అవకాశం రానే వచ్చిందని ట్రంప్ ఆదిశగానే అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.
కేన్సర్ తో పోరాడి చివరికి మృత్యువు ఒడికి చేరుకున్న అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూత్ బాడర్ గిన్స్ బర్గ్ అమెరికాకి చేసిన సేవలు విలువైనవని ట్రంప్ అన్నారు.
ఆమె మరణం అమెరికాకి తీరని లోటని ప్రకటించారు.ఉత్తర కరోలినాలో ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ ఆమెని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు వచ్చే వారంలో సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిని నియమిస్తానని, అది కూడా ఓ మహిళనే న్యాయమూర్తిగా ఎంపిక చేస్తానని ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడిగా ఈ నిర్ణయం తీసుకునే అన్ని అధికారాలు తనకి ఉన్నాయని అన్నారు.
ఈ విషయంలో డెమోక్రాటిక్ పార్టీ నేతలు అడ్డుపడాలని చూస్తున్నారని, ఎన్నికలు అయ్యే వరకూ కూడా న్యాయమూర్తిని నియమించవద్దని అంటున్నారని అందుకు అధ్యక్షుడిగా నేను అంగీకరించనని ట్రంప్ తేల్చి చెప్పారు.దొరకక దొరకక మంచి అవకాశం దొరికితే ట్రంప్ ఏ మాత్రం వదులుకోవడానికి సిద్దంగా లేరని ఆయన వర్గం అంటోంది.
అంతేకాదు ఈ అత్యున్నత పదవిలో భారతీయ మహిళని నియమిస్తే కమలా హరీస్ కి చెక్ పెట్టినట్టేనని, భారతీయ అమెరికన్స్ ఓట్లు తనకి పడతాయని ట్రంప్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.మరో వైపు అమెరికన్ మహిళని ఈ పదవికి ఎంపిక చేస్తే కరోనా విషయంపై కోపంగా ఉన్న అమెరికన్ ప్రజల దృష్టిని మరల్చినట్టుగా ఉంటుందని కూడా ట్రంప్ యోచిస్తున్నారట.
ఏది ఏమైనా ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారోనని డెమోక్రటిక్ పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారని స్థానిక మీడియా తెలిపింది.