ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) గురించి అమెరికాలో తెలియని తెలుగు వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు.అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లకి, తెలుగు బాషని ప్రేమించే కవులు, రచయితలూ అందరికి నాటా సుపరిచితమే.
ఎందుకంటే తెలుగుబాషాభివృద్ది లో భాగంగా సంస్కృతీ, సాంప్రదాయంలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ, తెలుగును పరిరక్షిచడంలో, విదేశాలలో ఉన్న తెలుగు ఎన్నారైలు అందరిని ఒకే తాటిపైకి రావడంలో ఎంతో కృషి చేస్తోంది.ఈ క్రమంలోనే
నాటా సాహిత్య పోటీలు 2020 పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి పోటీలు నిర్వహించింది.
ఈ పోటీలకు ప్రపంచ నలుమూలలలో ఉన్న తెలుగు రచయితలు, బాషాభిమానుల నుంచీ స్పందన వచ్చింది.అయితే తాజాగా ఈ పోటీలలో పాల్గొని గెలిచినా వారిని నాటా ప్రకటించింది.
నాటా అధ్యక్షుడులు గోసల .రాఘవ రెడ్డి, అలాగే సెక్రెటరీ ఆళ్ళ రామిరెడ్డి పర్యవేక్షణలో ఈ పోటీల విజేతల ప్రక్రియ జరిగింది.పోటీలలో గెలుపొందిన విజేతలు జూమ్ యాప్ ద్వారా పాల్గొన్నారని తెలిపారు.
విజేతల వివరాలు.
డాక్టర్ ఎం.సుగుణ రావ్ – పోలేరమ్మ కధ
వసుందర : అహం బ్రహ్మాస్మి కధ
యండపల్లి.భారతి : కడుపుకోట్టిన కరోనా కధ
దేవేంద్ర చారి : క్షమించండి.కధ
బహుముఖ పయనం : స్వర్ణ శైలజ దంత – కవిత్వం
లోపలేదో కదులుతున్నట్టు : పలమనేరు బాలాజీ – కవిత్వం
పెగలని మాట – దేశ రాజు : కవిత్వం
నా మాట విను – కిరణ్ విభావరి : కవిత్వం
నాన్న పడక కుర్చీ – డి.నాగజ్యోతి శేఖర్ : కవిత్వం