విద్యార్థిని చదువుకు ఆటంకాన్ని తొలగించిన ఎయిర్ టెల్ డీటీహెచ్ !

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ప్రజలు, యాజమాన్య సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.విద్యార్థులు గత 6 నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు.కరోనా విజృంభణతో విద్యాసంస్థలు కూడా తెరవని పరిస్థితి.దీంతో తెలంగాణ ప్రభుత్వం పరీక్షలను కూడా రద్దు చేసి అందరిని పాస్ చేసింది.ఇప్పటికే విద్యార్థుల అకాడమిక్ ఇయర్ దెబ్బతిన్నదని, విద్యార్థులు విద్యను మరిచిపోతున్నారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించింది.దూరదర్శన్, టీ-శాట్ ద్వారా విద్యార్థులకు క్లాసులు కొనసాగేలా చర్యలు కూడా తీసుకుంటోంది.

 Airtel Team Free Assit To Adilabad Student For Online Classes, 2kms Walk, Online-TeluguStop.com

దీంతో పాటు బీద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రాయపంచాయతీకి టీవీలను కూడా ఏర్పాటు చేస్తోంది.

ఆన్ లైన్ విద్యాబోధన కోసం ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పడం లేదు.

విద్యుత్ సమస్యతో పాటు సిగ్నల్ సమస్య కూడా ఎదురువుతున్నాయి.దీంతో వాళ్లు సిగ్నల్ కోసం పడరాని పాట్లు పడుతున్నారు.

నిర్మల్ జిల్లా రాజూర గ్రామానికి చెందిన 12 ఏళ్ల సఫా జరీన్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది.ఇంటి దగ్గర ఇంటర్నెట్ ప్రాబ్లమ్ ఉండటంతో సఫా జరీన్ ఆన్ లైన్ క్లాసులు వినేందుకు ప్రతి రోజు 2 కిలోమీటర్ల వరకు నడిచి క్లాసులు వినేది.

రోజూ ఉదయం 11 గంటలకు తన పొలానికి చేరుకుని మంచంపై 2 గంటలు కూర్చొని ఆన్ లైన్ క్లాసులు వినేది.ఉపాధ్యాయులు ఇచ్చిన హోంవర్క్ ని కూడా అక్కడే కంప్లీట్ చేసేది.

అలా క్లాసులు వినడానికి సఫా జరీన్ ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎయిర్ టెల్ సంస్థ సఫా జరీన్ ఇంటికి చేరుకున్నారు.

చదువుకు ఆటంకం కలుగుతుందని భావించిన ఎయిర్ టెల్ సంస్థ ఉచితంగా ఎయిర్ టెల్ డీటీహెచ్ ను ఏర్పాటు చేశారు.

దీంతో జరీన్ ఎయిర్ టెల్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపింది.ఇప్పటి నుంచి 2 కి.మీ నడిచే అవసరం లేదని, ఇంట్లోనే ఉంటూ చదువుకోవచ్చని సఫా జరీన్ సంతోషం వ్యక్తం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube