కొండ అంచున వేలాడుతూ ఫోటోకు ఫోజిచ్చిన జంట... ఎలా సాధ్యమైందంటే?

ఈ మధ్య కాలంలో యువతలో ఫోటోలపై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది.రోజుకు పది ఫోటోలైనా దిగే వాళ్లు మనలో ఎంతో మంది ఉంటారు.

 Bride And Groom Pose For Terrifying Wedding Photoshoot Hanging Off The Edge Of-TeluguStop.com

మరి కొంతమంది ఫోటోలకే ప్రాధాన్యత ఇస్తూ మంచి కెమెరా ఉండే ఫోన్లనే కొనుగోలు చేస్తున్నారు.ఇక పుట్టినరోజు, పెళ్లిరోజు లాంటి వేడుకల్లో ఫోటోలకు ఉండే ప్రాధాన్యత అంతాఇంతా కాదు.

ఏదైనా పెళ్లి జరుగుతుందంటే పెళ్లికి ముందు వెడ్డింగ్ ఫొటోషూట్ ఉంటుంది.

లైఫ్ మెమరీగా వెడ్డింగ్ ఫోటోషూట్ ఉండే విధంగా ప్రతి ఒక్కరూ ప్లాన్ చేసుకుంటారు.

అయితే కొందరు ఈ వెడ్డింగ్ షూట్ కోసం ప్రమాదకరమైన ప్రదేశాలను ఎంచుకుంటూ ఉండటం గమనార్హం.అర్కాన్సాస్‌లోని మౌంటెన్ హోమ్‌కు చెందిన ర్యాన్ మైయర్స్, స్కై మైయర్స్ వెడ్డింగ్ షూట్ కోసం కొండ అంచున నిలబడి ఫోటో దిగారు.

కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ వల్ల ఎక్కువ సంఖ్యలో వివాహానికి హాజరు కాకూడదనే నిబంధనలు ఉండటంతో పరిమిత సంఖ్యలోనే ఈ వేడుకలకు హాజరు కావాల్సి ఉండటంతో వెడ్డింగ్ ఫోటో షూట్ అయినా గ్రాండ్ గా జరుపుకోవాల్సి ఉంటుంది.

ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నూతన జంట కొండ అంచుపై నిలబడి ఫోజులిచ్చారు.

అయితే కొండ అంచున జంట నిలబడటం ఎలా సాధ్యమైందనే అనుమానం కలుగుతుందా…? అయితే వారి భద్రత కోసం ముందుజాగ్రత్తగా తాడుతో కట్టి ఉంచారు.దూరం నుంచి మనం గమనిస్తే వాళ్లు కొండ మీద నుంచి కింద పడే విధంగా ఫోటోగ్రాఫర్ ఫోటోను క్లిక్ మనిపించాడు.

హాక్స్బిల్ క్రాగ్ నూతన జంట వివాహం కొన్ని రోజుల క్రితమే ఘనంగా జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube