రాష్ట్రవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది.ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలో 29 మంది ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు.
అయితే తాజాగా ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోంది.ఈ రోజు జరగబోయే సమావేశానికి కరోనా సోకిన ఎమ్మెల్యేలు, మంత్రులతో ఎక్కవగా కలిసి ఉన్న వారెవరూ కూడా అసెంబ్లీకి రావొద్దని సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు.
అసెంబ్లీ సమావేశం నిర్వహించడంతో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.హాజరయ్యే ఎమ్మెల్యేలకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు.పరీక్షల కోసం విధాన సభలో ట్రూనాట్, ఆర్ఏటీ మెషిన్లను ఏర్పాటు చేయనున్నారు.పంజాబ్ భవన్, ఎమ్మెల్యేల వసతి గృహాల్లో కూడా ఈ యంత్రాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
కరోనా నిర్ధారణ చేసిన 48 గంటల తర్వాత రిపోర్టులను బట్టి ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాలను అనుమతించనున్నారు.ఇటీవల నిర్వహించిన ధర్నాలలో ఆప్ ఎమ్మెల్యేలకు, ధర్నాలో పాల్గొన్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ వచ్చింది.
గతంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది.ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలకు కరోనా సోకిన ఎమ్మెల్యేలు దూరం ఉండాలని సీఎం ఆదేశించాడు.
వచ్చే నెలలో కరోనా కేసులు భారీగా పెరుగుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.







