భారత దేశంలో ఆధార్ కార్డు ఉపయోగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దేశంలోని ప్రతి ఒక్క మనిషికి కీలకమైన డాక్యుమెంట్ లో ప్రధానంగా ఇప్పుడు ఈ కార్డు చేరిపోయింది.
రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందించే కొన్ని సంక్షేమ పథకాలను అందుకోవాలని ఈ కార్డు కచ్చితంగా అవసరమే.అంతేకాదు ఈ కార్డు ద్వారా అనేక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
కాబట్టి భారతదేశంలో ప్రస్తుతం కచ్చితంగా అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.ఇలా ఉండగా ఆధార్ కార్డు లో కొన్నిసార్లు పొరపాట్లు దొర్లుతుంటాయి.
అందువల్ల వాటిని కరెక్ట్ గా సరిచూసుకొని ఏవైనా తప్పులు ఉంటే దాన్ని కచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.లేకపోతే చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అయితే సరి చేసేందుకు కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి.చిన్న పట్టణాలలో ఆఫ్ లైన్ విధానంలో ఆధార్ సెంటర్స్ ఉండడంతో వాటికి వెళ్లి అప్డేట్ చేసుకోవడం, లేకపోతే నగరాల్లో ఉండేవారు ఎక్కడో ఉండే ఆధార్ సెంటర్ కి వెళ్ళలేక పోవడంతో ఆన్లైన్ విధానం ద్వారా సరి చేసుకోవచ్చు.
అయితే ఇందుకు సంబంధించి కొన్ని చార్జీలను వసూలు చేస్తారు.తాజాగా ఆధార్ సేవలు అందిస్తున్న యూఐడీఏఐ ఛార్జీలను పెంచింది.ఇందుకు సంబంధించి ఇది వరకు కేవలం యాభై రూపాయలు తీసుకునే యూఐడీఏఐ తాజాగా ఆధార్ వివరాలు మార్చడానికి మరో 50 రూపాయలను పెంచింది.ఇక మీదట ఆధార్ కార్డు లో మీ ఫోటో మార్చాలి అనుకునేవారు వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డు లో ఒకటి కంటే మార్పు చేయాల్సి ఉంటే ఇకమీదట 100 రూపాయలు కచ్చితంగా చెల్లించాల్సిందే.లేకపోతే వయసు, ఫోన్ నెంబర్ లాంటివి ఒకటి మార్చాలంటే కేవలం 50 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.