నాగార్జున హీరోగా సాల్మాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రయోగాత్మక సినిమా వైల్డ్‌డాగ్.ఈ సినిమా నాగార్జున గతంలో నటించిన గగనం సినిమా తరహాలో ఉంటుంది.అందులో ఒక విమానం హైజాక్ నేపథ్యంలో కథ నడుస్తుంది.ఇందులో మాత్రం ముంబయి పేళుడు మరియు ఆ తర్వాత జరిగిన పరిణామలతో కథ ఉంటుందట.ఈ సినిమాలో నాగార్జున ఎన్‌ఐఏ ఏజెంట్‌గా కనిపించబోతున్నాడు.అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే వచ్చింది.
సినిమాకు మాత్రం ఇప్పటి వరకు హైప్ రావడం లేదు.దాంతో బిజినెస్ విషయంలో నిర్మాతలకు నిరాశ తప్పడం లేదు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాను ఓటీటీ కి అమ్మాలనుకున్నారట.ప్రముఖ ఓటీటీని సంప్రదించగా ఇప్పటి వరకు డీల్ కు వారు ఆసక్తి చూపడం లేదట.మరో రెండు మూడు ఓటీటీలు కూడా ఈ సినిమా విషయంలో ఆసక్తి చూపించనట్లుగా వ్యవహరిస్తున్నాయట.భారీ రేటును పెట్టేందుకు ఆ ఓటీటీలు సిద్దంగా లేవట.
కనీసం బడ్జెట్ కూడా రాకుండా ఎలా ఇస్తామని నిర్మాతలు భావిస్తున్నారు.నిర్మాతలు కోట్ చేసిన అమౌంట్ కు అయితే సినిమా వద్దంటూ ఓటీటీ వారు మోహం చాటేస్తున్నారట.

గగనం సినిమా తరహాలోనే ఈ సినిమా కూడా ఒక ఆపరేషన్ నేపథ్యంలో సాగుతుంది.కనుక సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి ఉండవు.కనుక సాదారణ ప్రేక్షకులు సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తారా లేదా అనేది అనుమానం.అందుకే ఓటీటీలు ఈ సినిమాను కొనుగోలు చేయడం లేదు అనే టాక్ వస్తుంది.
నాగార్జున ఇలాంటి సినిమాను ఎలా కమిట్ అయ్యాడంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.