ఆ ఫోటో వివాదంపై ఎట్టకేలకు స్పందించిన నటి

సీనియర్‌ నటి కస్తూరి తాజాగా అలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేసింది.తాజాగా ఆ ఎపిసోడ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

హీరోయిన్‌ గా కస్తూరి తెలుగు వారికి సుపరిచితం.తమిళంలో ఎన్నో సూపర్‌ హిట్స్‌ను అందుకున్న కస్తూరి కొన్ని వివాదాస్పద అంశాలతో ట్రోల్స్‌ ఎదుర్కొన్న విషయం తెల్సిందే.

అందులో ముఖ్యంగా ఈమె టాప్‌ లేకుండా తన చిన్న పాపను ఎత్తుకుని ఫోటో షూట్‌ ఇచ్చింది.ఆ ఫొటో చాలా పెద్ద దుమారంను రేపింది.

సౌత్‌ హీరోయిన్‌ అవ్వడంతో కస్తూరి ఇలాంటి పనులు చేయడం ఏంటీ అంటూ చాలా మంది విమర్శించారు.ఆ సమయంలో సోషల్‌ మీడియా ఈ స్థాయిలో లేకున్నా కూడా వివిధ మార్గాల ద్వారా ట్రోల్స్‌ అయితే ఆమె చవి చూసింది.

ఇప్పుడు ఆ ఫోటోపై స్పందించింది.ఆ ఫోటోను మేము విదేశాల్లో ఉన్న సమయంలో తీసుకోవడం జరిగింది.

అది ఒక ప్రముఖ హెల్త్‌ మ్యాగజైన్‌ కోసం తీయించారు.అక్కడ ఇలాంటి ఫోటోలు చాలా కామన్‌ అనుకున్నాం.

మేము కూడా ఫోటో షూట్‌ కు ఓకే చెప్పాం.అయితే అనుకోకుండా ఆ ఫొటో బయటకు లీక్‌ అయ్యింది.

ఇండియన్స్‌ ఆ ఫోటో విషయంలో విమర్శలు చేస్తారని భావించాం.అందుకే ఇక్కడ అది కనిపించకుండా చేయాలనుకుంటే సాధ్యం కాలేదు.

ఎవరో కావాలని దాన్ని లీక్‌ చేశారు.దాంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!

అయితే అందులో తప్పేం లేదు.కాని కొందరు మాత్రం దాన్ని ఒక పెద్ద తప్పుగా భావించారు.

నన్ను ఆ విషయంలో ఎంతగానో విమర్శించారు అంటూ కస్తూరి అప్పటి విషయాన్ని గుర్తు చేసుకుంది.

తాజా వార్తలు