ఆసుపత్రి ఐసీయూ లో మంటలు,భారీ అగ్నిప్రమాదం!

గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లోని శ్రేయ్ దవాఖానా లోని ఐసీయూ లో మంటలు చెలరేగాయి, దీనితో ఈ రోజు తెల్లవారు జామున అక్కడ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

విద్యుదాఘాతం కారణంగా కోవిడ్ ఆసుపత్రి ఆయిన శ్రేయ్ హాస్పటల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి, దీనితో భారీ అగ్నిప్రమాదం గా మారడం తో దాదాపు 8 మంది కోవిడ్ రోగులు మృతి చెందగా,మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ భారీ అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాయి.మరోపక్క ఒక్కసారిగా ఆసుపత్రిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం తో సిబ్బంది,రోగులు భయం తో బయటకు పరుగులు తీశారు.

ప్రమాద సమయంలో 40 మంది రోగులను రక్షించి వారిని సర్ధార్ వల్లభాయ్ పటేల్ దవాఖాన కు తరలించినట్లు తెలుస్తుంది.మరోపక్క ఈ ఘటన పై ప్రధాని నరేంద్ర మోడీ సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి ఈ ఘటనలో మరణించిన వారికీ రూ.2 లక్షల ఆర్థికసాయం,అలానే క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.మరోపక్క ఆ దవాఖానా ను అధికారులు సీజ్ కూడా చేసినట్లు తెలుస్తుంది.

ఈ ఘటన పై గుజరాత్ సీఎం విజయ్ రూపానీ స్పందిస్తూ ఈ ఘటన పై సమగ్ర దర్యాప్తు జరిపి 3 రోజుల్లో నివేదిక అందించాలి అంటూ అధికారులను ఆదేశించారు.

Advertisement
బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు

తాజా వార్తలు