భార్యను చంపిన భర్త: భారతీయుడికి జీవితఖైదు విధించిన దుబాయ్ కోర్టు

అనుమానంతో ముందు వెనుక ఆలోచించకుండా భార్యను హతమార్చిన భారతీయుడికి దుబాయ్ కోర్టు జీవిత ఖైదు విధించింది.కేరళకు చెందిన విద్యా చంద్రన్, యుగేష్ దంపతులు.

విద్య తన పిల్లలతో కలిసి దుబాయ్‌లో జీవిస్తున్నారు.ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్ 9న విద్యను భర్త యుగేశ్ ఆమె ఆఫీసులో పార్కింగ్ ప్రదేశంలోనే కత్తితో పొడిచి చంపాడు.

ఈ కేసుకు సంబంధించి యుగేశ్‌ను అదే రోజు జెబెల్ అలీలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.విచారణ సందర్భంగా విద్యకు తన ఆఫీసులో ఎవరితోనో అక్రమ సంబంధం వుందని.

ఈ కారణంగానే తన భార్యను హత్య చేసినట్లు పోలీసులకు యుగేశ్ తెలిపాడు.అక్రమ సంబంధానికి సంబంధించి ఆఫీసులోని మేనేజర్ తనకు మెసేజ్ పెట్టినట్లు చెప్పుకొచ్చాడు.

Advertisement

ఈ కేసులో నేరస్తుడు తన నేరాన్ని అంగీకరించడంతో దుబాయ్ కోర్ట్ యుగేశ్‌కు జీవితఖైదు విధించింది.జూలై 20 నుంచి 15 రోజుల్లోగా ఈ తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు గడువు విధించింది.

న్యాయస్థానం తీర్పుపై విద్య సోదరుడు వినయ్ చంద్రన్ స్పందిస్తూ.తాము యుగేశ్‌కు మరణశిక్ష ఆశించామని, కానీ జీవితఖైదును విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.విద్యను యుగేశ్ తరచూ వేధించేవాడని, కానీ ఆమె తన కుమార్తెల కోసం అన్నింటినీ భరించిందని విద్యా చంద్రన్ స్నేహితుడు చెప్పాడు.

యుగేశ్ తన విజిటింగ్ వీసాపై దుబాయ్ వచ్చి ఆమెను హతమార్చినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

మా అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం.. కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో తీర్మానం
Advertisement

తాజా వార్తలు