ప్రస్తుతం టాలీవుడ్ మరియు కోలీవుడ్‌లో టాప్ స్టార్ హీరోయిన్‌గా కీర్తి సురేష్ వెలుగు వెలుగుతోంది.టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబుతో సర్కారు వారి పాట చిత్రంలో నటించబోతున్న కీర్తి సురేష్ మరో వైపు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కూడా నటిస్తుంది.
ఇదే సమయంలో కమల్‌కు జోడీగా కూడా ఈమెను నటింపజేసేందుకు గౌతమ్ మీనన్ రెడీ అయ్యాడు.ఇంత బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఫన్నీగా పోస్ట్‌లు పెడుతూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె పెట్టే పోస్ట్‌లు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.తాజాగా ఒక ఫొటోను పోస్ట్ చేసి స్వప్నదత్‌ను చూసిన సమయంలో నా ఫేస్ వెలిగి పోయింది.
ఆమె ఇచ్చే చివరి పారితోషికం తాలూకు ఆనందం కావచ్చు అంటూ ఫన్నీగా కామెంట్ పెట్టింది.మహానటి సమయంలోని ఫొటోను షేర్ చేసిన కీర్తి సురేష్‌కు ఆ సినిమా నిర్మాత అయిస స్వప్న సమాధానం చెప్పింది.
కీర్తి సురేష్ ఫాలోవర్స్ అంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటీ అంటే ఈ క్రాక్ పిల్ల కనీసం తన పారితోషికంను కూడా అడగదు.

పారితోషికం అడగకుండా ఎంత ఇచ్చినా అంతటితోనే సంతృప్తి పడుతుంది అన్నట్లుగా స్వప్న కామెంట్ చేసింది.ఆ కామెంట్‌కు కీర్తి సురేష్ అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు.నిజంగా కీర్తి సురేష్ చాలా మంచి అమ్మాయి.
ఆమె మృదు స్వభావి అని ఆమె నవ్వు చూస్తుంటేనే అర్థం అవుతుంది.ఆమె పారితోషికం విషయంలో పెద్దగా నిర్మాతలను ఇబ్బంది పెట్టదని స్వప్న చెబుతున్న విషయం ద్వారా తెలిసి పోతుందంటూ ఆమె అభిమానులు అంటున్నారు.