ఈ నటి ప్రముఖ విలన్ భార్య అని మీకు తెలుసా...?

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి (మొదటి బాగం) చిత్రంలో ప్రభాస్ తల్లి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన నటి రోహిణి గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే ఈమె తెలుగు చిత్రాలలో తల్లి పాత్ర అంటే అందరికీ ముందుగా నటి రోహిణి గుర్తొస్తుంది.

నటి రోహిణి గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.నటి రోహిణి స్వస్థలం విశాఖపట్టణం జిల్లాలోని అనకాపల్లి.

అయితే నటి రోహిణి తండ్రికి చిన్నప్పటి నుంచి నటుడు కావాలని ఆసక్తి ఉండేది. కానీ కుటుంబ పరిస్థితుల రీత్యా ఉద్యోగం చేయాల్సి రావడంతో పంచాయతీ ఆఫీసర్ గా పని చేశాడు.

కానీ రోహిణి ని మాత్రం సినిమాల వైపు ప్రోత్సహించి అండదండలు అందించాడు.ఆ విధంగా నటి రోహిణి సినీ జీవితానికి పునాదులు పడ్డాయి.

Advertisement

అయితే తెలుగులో రోహిణి "హారతి" అనే చిత్రంలో లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం ప్రారంభించి దాదాపు 30కి పైగా చిత్రాల్లో నటించింది.ఆ తర్వాత హీరోయిన్ గా  తెలుగు, తమిళం, మలయాళం భాషలలో నటించింది.

ఇక నటి రోహిణి వ్యక్తిగత జీవితానికి వస్తే 1996 సంవత్సరంలో టాలీవుడ్, కోలీవుడ్, మల్లువుడ్, బాలీవుడ్ తదితర సినిమా పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న రఘువరన్ ని పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లయిన ఎనిమిది సంవత్సరాలకే విడాకులు తీసుకుంది.

అలాగే పెళ్లి అయిన అనంతరం నటి రోహిణి సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది.ఆ తరువాత 2004వ సంవత్సరంలో ప్రముఖ విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించినటువంటి విరుమాండీ అనే తమిళ  చిత్రంలో నటించి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

ఇక అప్పటి నుంచి నటి రోహిణి విశ్రాంతి లేకుండా నటిస్తూనే ఉంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు