బంగారు బుల్లోడు టీజర్ టాక్: నవ్వులు పూయించిన అల్లరోడు!

టాలీవుడ్‌లో కామెడీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అల్లరి నరేష్, ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు.

వరుసగా రొటీన్ కామెడీ చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైన అల్లరి నరేష్, వరుసగా ఫ్లాప్ చిత్రాలతో రావడంతో హీరోగా సినిమాలు అవకాశాలు తగ్గాయి.

అయితే మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంలో క్యారెక్టర్ పాత్రలో నటించి మెప్పించాడు అల్లరి నరేష్.కాగా ఈ సినిమాలో అల్లరి నరేష్ నటనకు ప్రేక్షకులు మంచి రెస్పాన్స్ ఇచ్చారు.

ఇక ఇప్పుడు నాంది, బంగారు బుల్లోడు అనే రెండు సినిమాలను రిలీజ్‌కు రెడీ చేశాడు ఈ హీరో.కాగా నేడు తన పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్రాల టీజర్‌లను ఆయన రిలీజ్ చేశారు.

తాజాగా బంగారు బుల్లోడు చిత్ర టీజర్ రిలీజ్ చేయగా, పూర్తి కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఈ సినిమా ఉండబోతుందని ఈ టీజర్ చూస్తే తెలుస్తోంది.ఈ టీజర్‌లోనే సినిమా కథను పూర్తిగా చూపించేశారు చిత్ర యూనిట్.

Advertisement

బ్యాంకు లాకర్లలో ఉన్న బంగారం చుట్టూ సాగే ఈ సినిమా కథతో మరసారి కామెడీని పండించాలని చూస్తున్నాడు అల్లరి నరేష్.ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన పూజా ఝవేరి నటిస్తుండగా 30 ఇయర్స్ పృథ్వి, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, ప్రవీణ్, తనికెళ్ళ భరణి, ప్రభాస్ శ్రీను, మహేష్ వంటి కమెడియన్లు తమదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించేందుకు రెడీ అవుతున్నారు.

పి.వి గిరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేస్తుండగా సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.మరి ఈ కామెడీ టీజర్‌ను మీరు ఓసారి చూసేయండి.

Advertisement

తాజా వార్తలు