టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ అభిమాని అంటే అందరికి గుర్తుకొచ్చే పేరు హీరో నితిన్.తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని నితిన్ సొంతం చేసుకున్నాడు.
తాజాగా భీష్మ సినిమాతో సూపర్ హిట్ కొట్టి వరుసగా నాలుగు సినిమాలని నితిన్ లైన్ లో పెట్టాడు.అయితే లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం షూటింగ్ జరగాల్సిన రంగ్ దే సినిమా వాయిదా పడిపోయింది.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ అభిమానిని పవన్ కళ్యాణ్ సినిమాలో చూడటం అంటే కచ్చితంగా టాలీవుడ్ లో అది ట్రెండింగ్ న్యూస్ అవుతుంది.నిజంగానే నితిన్ పవన్ కళ్యాణ్ సినిమాలో కనిపిస్తాడనే వార్త టాలీవుడ్ లో వైరల్ గా మారింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు.
దీని తర్వాత క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.
ఈ సినిమాలో నితిన్ ఓ ఐదు నిమషాల పాటు కనిపిస్తాడనే మాట వినిపిస్తుంది.క్రిష్ పవన్ సినిమాలో అతను నటించే పాత్ర ఏంటీ అనేది ఆసక్తికరంగా మారింది.
పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో క్రిష్ ఆ పాత్ర కోసం నితిన్ ని సంప్రదించగానే ఏ మాత్రం ఆలోచించకుండా చేయడానికి ఒకే చెప్పినట్లు టాక్ నడుస్తుంది.అయితే ఆ పాత్ర కనిపించేది ఐదు నిమషాలు అయిన సినిమాలో తాని ప్రాధాన్యత ఎక్కువగానే ఉంటుందని చెప్పుకుంటున్నారు.
అయితే ఈ వార్తలలో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.