టాలీవుడ్లో కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి, అటుపై హీరోగా మారిన సునీల్ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు.అయితే వరుస ఫ్లాప్ చిత్రాలతో సతమతమవుతున్న సునీల్, మళ్లీ కామెడీ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఇప్పటికే పలు సినిమాల్లో కామెడీ పాత్రలు చేస్తున్నా ఆయనకు మునుపటి గుర్తింపు మాత్రం రావడం లేదు.
రీసెంట్గా సునీల్ నటించిన
అల వైకుంఠపురములో
చిత్రంలోనూ ప్రాముఖ్యత లేని పాత్రలో సునీల్ నటించాడు.
కాగా డిస్కో రాజా చిత్రంలో విలన్ పాత్రలో నటించిన సునీల్, ఆ సినిమాతోనైనా హిట్ అందుకుంటాడని అందరూ అనుకున్నారు.కానీ అది కూడా ఫ్లాప్ మూవీగా మారి ఆయన్ను నిరాశపరిచింది.
కాగా ప్రస్తుతం మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తోన్న సీటీమార్ చిత్రంలో కమెడియన్ పాత్రలో నటిస్తున్న సునీల్, ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు.
ఈ సినిమాలో గోపీచంద్ మహళా కబడ్డీ జట్టు కోచ్‌గా నటిస్తున్నాడు.
ఆయన అసిస్టెంట్ పాత్రలో సునీల్ కనిపిస్తాడు.అయితే ఈ సినిమాలో కామెడీ ట్రాక్‌ను తనదైన శైలిలో పండించేందుకు సునీల్ రెడీ అయ్యాడట.
దర్శకుడు సంపత్ నంది రాసుకున్న కామెడీ ట్రాక్ బాగుండటంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని సునీల్ ఆశిస్తున్నాడు.మరి ఈ సినిమాతోనైనా సునీల్ కెరీర్ తిరిగి పుంజుకుంటుందో లేదో చూడాలి.