రీమేక్ సినిమాకు బాలీవుడ్ బ్యూటీనే బతిమాలిన నితిన్

యంగ్ హీరో నితిన్ ఇటీవల భీష్మ అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో ఈ సినిమాను చూసేందుకు జనం ఎగబడ్డారు.

 Shilpa Shetty In Nithin Movie Of Andhadhun Remake, Nithiin, Andhadhun, Remake, S-TeluguStop.com

ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ చిత్రాలను లైన్‌లో పెడుతున్నాడు ఈ కుర్ర హీరో.కాగా బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన అంధాధున్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు నితిన్ రెడీ అవుతున్నాడు.

దర్శకుడు మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ రీమేక్ చిత్రంలో హీరో పాత్ర చాలా వైవిధ్యంగా ఉండనుండటంతో నితిన్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.ఇక బాలీవుడ్‌లో ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన టబు, ఆ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది.

కాగా తెలుగులోనూ ఆ పాత్రను ఆమెతోనే చేయించాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ ఆమె ఈ సినిమాను చేయడానికి ఒప్పుకోలేదు.

దీంతో ఈ పాత్రలో నటించాల్సిందిగా బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టిని కోరారట చిత్ర యూనిట్.

టాలీవుడ్‌లో అప్పుడెప్పుడో కనిపించిన శిల్పా శెట్టి, ఈ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోన్నట్లు తెలుస్తోంది.

అంధాధున్ చిత్ర రీమేక్‌లో నటించేందుకు ఆమె సుముఖుత చూపినట్లు చిత్ర వర్గాల టాక్.మొత్తానికి అంధాధున్ రీమేక్ చిత్రంపై అప్పుడే అంచనాలను క్రియేట్ చేసేందుకు నితిన్ అండ్ టీమ్ చాలా పెద్ద ప్లాన్ వేస్తున్నారు.

మరి వారి ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube