దాదాపుగా కరోనా వైరస్ నియంత్రణ భాగంగా ప్రభుత్వం చేతులెత్తేసింది అని అనుకోవచ్చు.సుమారుగా మూడు నెలల వరకు ఇంటి వద్దనే ఉన్న ప్రజలు కూడా బయట స్వేచ్ఛగా తిరగడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ మన చేతుల్లోనే ఉందని చెప్పవచ్చు.రోజు రోజుకి దేశంలో చాపకింద నీరులా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది మనం మాత్రం అజాగ్రత్తగా రోడ్ల మీదకు వచ్చి తిరిగితే మన ఇబ్బందులు పడటమే కాకుండా పక్క వారిని కూడా ఇబ్బందులకు గురిచేస్తాయి.
కాబట్టి ఇంట్లో వీలైనంతవరకు ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది.కాకపోతే వైరస్ నుంచి కాపాడాలంటే ఆ దేవుడే దిక్కు అని చెప్పవచ్చు.
అందుకే కాబోలు కొంత మంది ప్రజలు కరుణా దేవి పూజలు చేయడం కూడా ప్రారంభం చేశారు.
ఇక అది ఎక్కడ అంటే జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఇలా కొన్ని రాష్ట్రాలలో మహిళలు, హిజ్రాలు కరోనా దేవి పూజలు చేసేస్తున్నారు.
ఇకపోతే జార్ఖండ్ రాష్ట్రంలో పదుల సంఖ్యలో హిజ్రాలు కరోనా మాయి పూజలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు.అయితే ఈ పూజలు నిర్వహిస్తున్న ఓ హిజ్రా మాట్లాడుతూ కరోనా దేవి ఆవు రూపంలో నాకు కలలోకి వచ్చిందని అనంతరం ఆ ఆవు మహిళా రూపంలోకి మారింది అని తెలియజేసింది.
దేశ ప్రజలందరూ ఆ కరోనా దేవిని పూజిస్తే తాను ఎక్కడినుంచి వచ్చానో అక్కడికి వెళ్లిపోతానని చెప్పిందని హిజ్రా తెలియజేసింది.అందుకే మేము పూజలు నిర్వహిస్తున్నామని హిజ్రా తెలియజేసింది.
మరోవైపు బాంకీ నదీతీరంలో ఏకంగా 250 మంది మహిళలు కరోనా దేవికి పూజలు సమర్పిస్తున్నారు అంటే నిజంగా కరోనా పోతుందా అని ఆశ్చర్యపోతున్నారు.