ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కారణంగా దాదాపు అన్ని దేశాలు కూడా లాక్‌డౌన్‌ను విధించి దేశప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి.కాగా ఈ లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన పనులు పూర్తిగా స్తంభించిపోయాయి.
దీంతో పలు రంగాలు పెద్ద ఎత్తున నష్టాలను చవిచూస్తున్నాయి.అటు సినిమా రంగానికి చెందిన పనులు కూడా వాయిదా పడటంతో ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమా షూటింగ్‌లను మొదలుపెట్టేందుకు దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు.
టాలీవుడ్‌లో ముందుగా షూటింగ్ జరుపుకునే చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కూడా ఒకటి.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఆచార్యపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఆచార్య లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.కాగా ఇప్పుడు షూటింగ్ తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతున్న ఆచార్యకు ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది.
ప్రస్తుతం ఈ సినిమాకు కేటాయించిన బడ్జెట్‌ను తగ్గించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.అందుకు మెగాస్టార్ చిరంజీవి కూడా ఓకే అన్నాడట.
ఇప్పుడు జరగబోయే షూటింగ్‌లలో చిత్ర యూనిట్ సంఖ్యను తగ్గించాలని, విదేశీ షూటింగ్‌లు కాకుండా ఇక్కడే షూటింగ్ నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది.దీంతో ఎక్కవ బడ్జెట్ కాదని, నిర్మాతలకు ఎక్కువ రిస్క్ ఉండదని చిత్ర యూనిట్ అంటోంది.
చిరు కూడా ఇదే స్ట్రాటజీని మిగతా చిత్రాల దర్శకనిర్మాతలు ఫాలో కావాలని కోరుతున్నాడు.ప్రస్తుతం ఉన్న క్లిష్టపరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్స్‌కు వెళ్లి సినిమా చూడకపోవచ్చని, అప్పుడు సినిమాకు ఎక్కవ బడ్జెట్ కేటాయించడం నిర్మాతలకు నష్టమే అవుతుందని ఆయన వారికి సూచించారు.