అల వైకుంఠపురములో అడుగు పెడతానంటోన్న స్టార్ హీరో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఇక ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తి సక్సె్స్ అయ్యింది.కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.

ఈ సినిమా సాధించిన విజయంతో అల వైకుంఠపురములో సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు.కాగా బాలీవుడ్‌లో వరుసగా తెలుగు సినిమాలను రీమేక్ చేస్తుండటంతో ప్రస్తుతం అల వైకుంఠపురములో చిత్రాన్ని కూడా హిందీలో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఈ సినిమా రీమేక్ హక్కులను అశ్విన్ వర్దే సొంతం చేసుకోగా ప్రస్తుతం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను తీసుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.బాలీవుడ్‌లో ఈ సినిమాను టాప్ డైరెక్టర్‌తో తెరకెక్కించేందుకు చిత్ర నిర్మాత రెడీ అవుతున్నాడు.

Advertisement

మరి టాలీవుడ్‌లో సాధించిన సక్సెస్‌ను ఈ సినిమా రీమేక్ బాలీవుడ్‌లో సాధిస్తుందో లేదో చూడాలి.కాగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనుండగా, ఈ సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

అందుకే నేను ఏ రోజు సొంత పిల్లల గురించి ఆలోచించ లేదు : రాజమౌళి
Advertisement

తాజా వార్తలు