అక్కడ పెళ్లి కాని ప్రసాద్ లకు గుడ్ న్యూస్...

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ని అరికట్టడం కోసం లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా లాక్ డౌన్ విధించడంతో సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

అయితే ఈ లాక్ డౌన్ కారణంగా పెళ్లిళ్లు, ఇతరత్రా శుభకార్యాలు పెద్ద మొత్తంలోనే ఆగిపోయాయి.గత సీజన్లో ఒక హైదరాబాదులోనే దాదాపుగా 15 వేలకు పైగా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి.

అయితే గత పది రోజులుగా కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో సడలింపులు చేపడుతూ శుభకార్యాలకు అనుమతులు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఇందులో భాగంగా తాజాగా కర్ణాటక రాష్ట్రం ప్రభుత్వం పెళ్లిళ్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

ఇందులో ఈ నెల 24 మరియు 31 వ తారీకుల్లో  ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పెళ్లిళ్లు జరుపుకోవచ్చని స్పష్టం చేసింది.అలాగే ఈ రెండు తారీఖుల్లో  పెళ్లిళ్లు చేసుకోవాలనుకునే వాళ్ళు కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని కూడా తెలిపారు.

Advertisement

దీంతో కరోనా కారణంగా పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నటువంటి వాళ్లకి ఈ విషయం కొంతమేర ఊరట కలిగిస్తుందని చెప్పొచ్చు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వివాహ వేడుకలు మరియు ఇతర శుభకార్యాలకు 50 మంది కంటే ఎక్కువ హాజరు కాకూడదని ప్రభుత్వం నిబంధనలు విధించింది.

అంతేకాక జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించింది.అయితే ఇందులో ముఖ్యంగా జనాలు ఎక్కువగా కలిసేటువంటి వేడుకలకు చిన్న పిల్లలను మరియు నిండు గర్భిణులను హాజరు కావద్దని పలువురు వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు