అంతా భయపడుతున్నా ఆర్‌ఆర్‌ఆర్‌ టీం మాత్రం దూకేందుకు ఆరాటం

కరోనా కారణంగా తెలుగు సినిమా, తమిళ సినిమా అనే కాకుండా హాలీవుడ్‌ సినిమాల వరకు అన్ని కూడా వాయిదాలు పడ్డాయి.

భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమాలు కూడా ఇప్పటికప్పుడు విడుదల చేయలేని పరిస్థితి.

వాయిదా వేస్తే కోట్ల నష్టం తప్పదు.దాంతో నిర్మాతలంతా కూడా తల పట్టుకున్నారు.

కాని ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర నిర్మాత మాత్రం చాలా ధీమాగా ఉన్నట్లుగా తెలుస్తోంది.దాదాపుగా 400 కోట్ల బడ్జెట్‌తో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం రూపొందుతోంది.

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు.వచ్చే ఏడాది వరకు పరిస్థితులు సర్దుమనిగే అవకాశం ఉంది.

Advertisement

అప్పటి వరకు సినిమా థియేటర్ల పరిస్థితి యధా స్థితికి వచ్చే అవకాశం ఉంది.కనుక ఖచ్చితంగా తాము పెట్టిన మొత్తంకు డబుల్‌ వస్తాయనే నమ్మకంతో దానయ్య ఉన్నాడట.

బాహుబలి చిత్రం రెండు వేల కోట్ల వసూళు చేసింది.

బాహుబలికి ఏమాత్రం తీసిపోకుండా రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం కనీసం వెయ్యి కోట్లు అయినా వసూళ్లు చేస్తుందనే నమ్మకంతో మేకర్స్‌ ఉన్నారు.ఇక ఇతర రైట్స్‌ ద్వారా మరో అయిదు వందల కోట్ల వరకు వస్తాయి.కనుక ఎంత లేదన్నా కూడా వెయ్యి కోట్ల ప్రాఫిట్‌ అంటూ కొందరు నమ్మకంగా చెబుతున్నారు.

వెయ్యి కాకున్నా కూడా అయిదు వందల కోట్లు అయినా వస్తాయని చెబుతున్నారు.దీంట్లో ఎలాంటి అనుమానాలు లేవంటూ సినీ వర్గాల వారు కూడా అంటున్నారు.ఈ కారణంగానే దానయ్య అండ్‌ టీం లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే షూటింగ్‌కు రెడీ అవుతున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!

లాక్‌డౌన్‌ ఎప్పుడెప్పుడు ఎత్తివేస్తారా అంటూ వీరు ఆరాటంగా ఎదురు చూస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు