కట్టింగ్స్‌ లేక హీరోయిన్స్‌ లక్షలు నష్టపోతున్నారట పాపం

దేశంలో లాక్‌డౌన్‌ వల్ల కొన్ని కోట్ల మంది నష్టపోతున్నారు.

కూలీ పని చేసుకునే వారు కనీసం తిండి దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే డబ్బున్న వారు కూడా ఏదో ఒక రకంగా నష్టాల బారిన పడుతూనే ఉన్నారు.

సాదారణ సమయంలో సెలబ్రెటీలు ఎక్కువగా ఏదో ఒక కార్యక్రమం అంటూ బిజీ బిజీగా తిరుగుతూనే ఉంటారు.ఇక హీరోయిన్స్‌ అయితే మాల్స్‌ ఓపెనింగ్స్‌కు వెళ్తూ లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకుంటూ ఉంటారు.

షాపింగ్‌ మాల్స్‌.ఇతర స్టోర్స్‌ అన్ని కూడా ఈమద్య కాలంలో మూత పడ్డాయి.దాంతో అవి మళ్లీ మునుపటి పరిస్థితికి రావాలంటే కనీసం ఆరు నెలల సమయం అయినా పడుతుంది.

అప్పటి వరకు హీరోయిన్స్‌కు గడ్డు పరిస్థితి తప్పదు.అవకాశాలు లేని హీరోయిన్స్‌ చాలా మంది కూడా ఆ ఓపెనింగ్స్‌కు వెళ్తు నెలకు లక్ష రెండు లక్షలు సంపాదించుకుని కాలం గడిపేస్తున్నారు.

Advertisement

ఇప్పుడు వారికి అది కూడా లేదు.భవిష్యత్తులో ఉంటుందో లేదో కూడా తెలియదు.

స్టార్‌ హీరోయిన్స్‌ పాతిక లక్షల నుండి యాబై లక్షల వరకు తీసుకుంటారు.స్టార్‌ హీరోయిన్స్‌కు పెద్దగా నష్టం ఏమీ లేదు.ఎందుకంటే వారు మళ్లీ సినిమాలతో బిజీ అవుతారు.

ఆ తర్వాత యాడ్స్‌ వస్తాయి.కాని చిన్న హీరోయిన్స్‌ మోడల్స్‌ మాత్రమే ఇప్పుడు ఇబ్బందులకు గురి అవుతున్నారు.

ఈ విషయంలో ఆ హీరోయిన్స్‌ లక్షలు నష్టపోతున్నారు.వారి నష్టం భర్తీ చేయలేనిది అంటున్నారు.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు