కుటుంబాన్ని పోషించుకోవడం కోసమే అలాంటి సినిమాల్లో నటించా : షకీలా

ఒకప్పుడు ఆమె చిత్రాలు విడుదలవుతున్నాయి అంటే దాదాపుగా స్టార్ హీరో చిత్రాలైనా వాయిదా వేసుకుని వాళ్ళు.

ఇంతకీ ఆమె ఎవరు అనే విషయం మీకు ఈ పాటికే అర్ధం అయి ఉంటుంది.

ఆమె ఎవరో కాదు ఒకప్పటి శృంగార నటి షకీలా.అయితే ఈమె తన సినిమాలతో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, తదితర భాషల్లో పలువురు అభిమానులను సంపాదించుకుంది.

తాజాగా షకీలా ఓ ప్రముఖ వార్తా పత్రిక నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొంది.ఇందులో భాగంగా పలు ఆసక్తికర అంశాలను తెలియజేసింది.

అయితే ఇందులో మొదటగా తాను అనుకోకుండా సినిమా పరిశ్రమకి వచ్చానని, వచ్చిన తర్వాత మాత్రం అందరి లాగా తాను కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని పలు ప్రయత్నాలు కూడా చేశానని చెప్పుకొచ్చింది.కానీ మొదట్లో తన కుటుంబ పోషణ నిమిత్తం  రెండు, మూడు చిత్రాల్లో అలాంటి పాత్రలో నటించానని కానీ ఆ పాత్రలే తన సినీ జీవితాన్ని నిర్ణయించేశాయని తెలిపింది.

Advertisement

అయితే అప్పట్లో తాను ఓ చిత్రంలో నటించాలంటే దాదాపుగా మూడు లక్షలు పారితోషికం తీసుకునే దానిని, కానీ ఎక్కువ శాతం సినిమాలు కేవలం డబ్బు కోసం మాత్రమే చేశానని తెలిపింది.కానీ తెలుగులో నితిన్ నటించినటువంటి జయం, ప్రిన్స్ మహేష్ బాబు నటించిన నిజం చిత్రాలు మాత్రం చాలా ఇష్టపడి చేశానని చెప్పుకొచ్చింది.

తాను సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో డబ్బుపై ధ్యాస పెట్టలేక పోయానని,  ఒకప్పుడు చిత్రంలో నటించాలంటే లక్షల రూపాయల పారితోషికం తీసుకునే తాను ప్రస్తుతం సొంత ఇల్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్నానని వాపోయింది.తనని తన అనుకున్నవాళ్లే నమ్మించి మోసం చేశారని ఎమోషనల్ అయింది.

అయితే సినీ పరిశ్రమలో అప్పట్లో ఒక వ్యక్తిని ప్రేమించానని, ఆ వ్యక్తి కూడా తనని ప్రేమించాడని కానీ తాను అలాంటి చిత్రాల్లో నటిస్తుండడంతో తన ప్రియుడి కుటుంబ సభ్యులు తమ పెళ్లికి అంగీకరించలేదని తెలిపింది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు