సెన్సేషనల్ కాంబో కుదిరేది ఎప్పుడో?

టాలీవుడ్‌లో స్టార్ హీరోలు పవన్ కళ్యాన్, మహేష్ బాబు సినిమాల మధ్య ఎలాంటి పోటీ నడుస్తుందో అందరికీ తెలిసిందే.

పవన్ రికార్డును మహేష్ ఓవర్‌టేక్ చేస్తే, మహేష్ రికార్డులను పవన్ బద్దలు కొడుతుంటాడు.

ఇక ఈ హీరోల ఫ్యాన్స్ మధ్య నడిచే వార్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.తమ హీరో గొప్ప అంటే తమ హీరోనే నెంబర్ వన్ అంటూ వారి మధ్య వార్ ఎప్పుడూ నడుస్తూనే ఉంది.

అయితే ఈ ఇద్దరు హీరోలు కలిసి ఓ సినిమా చేస్తే చూడాలనుకునే వారి సంఖ్య మాత్రం చాలా ఎక్కువే.ఇద్దరు స్టార్ హీరోలు కలిసి సినిమా చేస్తే ఆ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలని ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయి.

కాగా రాజకీయాల్లో బిజీగా ఉండటంతో పవన్ సినిమాలకు గుడ్‌బై చెప్పినప్పుడు, ఈ కాంబోలో సినిమా రావడం ఇక అసాధ్యం అని అందరూ అనుకున్నారు.కానీ పవన్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండటంతో మహేష్‌తో కలిసి సినిమా చేస్తే బాగుంటుంది అని చాలా మంది కోరుతున్నారు.

Advertisement

మరి ప్రేక్షకుల కోరికను ఈ ఇద్దరు హీరోలు ఎప్పుడు నెరవేరుస్తారో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.కాగా పర్ఫెక్ట్ కథ, దర్శకుడు దొరికితే ఈ కాంబోను సెట్ చేయడం పెద్ద విషయం కాదని వారు అంటున్నారు.

మరి పవన్, మహేష్ కాంబో చూసే అదృష్టం ప్రేక్షకులకు ఎప్పడు దక్కుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు