అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అవుతోంది.పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండటంతో ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది.
ఈ సినిమాలో అఖిల్ తనకు ఓ ప్రేయసి కావాలని, అన్ని అభిరుచులు కలిసే ఆ అమ్మాయి కోసం ఎంతో కష్టపడి వెతుకుతాడట.
అయితే పూజా హెగ్డే అఖిల్‌కు బాగా నచ్చడంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని చూస్తాడు.కానీ ఆమెకున్న యాటిట్యూడ్ వల్ల అఖిల్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు.
కొన్నిసార్లు ఆమె వల్ల అతడు ప్రాణాపాయ స్థితిలో కూడా పడతాడని తెలుస్తోంది.
ఇలా ఒక అమ్మాయి బ్యాచ్‌లర్ బతుకును బస్టాండ్ చేయడం అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట భాస్కర్.
ఓవరాల్‌గా ప్రేమ మనుష్యులు ఎలా మారుతారనే విషయాన్ని మనకు ఈ సినిమాలో చూపించనున్నాడు.ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.