ఈ నెల 15 తారీఖు నుంచి రైల్వే సేవలు మొదలు....

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అత్యవసర లాక్ డౌన్ ని విధించిన సంగతి అందరికీ  తెలిసిందే.

అయితే ఇందులో భాగంగా ప్రజలను ఇతర ప్రాంతాలకు వెళ్లనీయకుండా ఎక్కడివారిని అక్కడే నిలిపివేసేందుకు రవాణా వ్యవస్థ ను మూసి వేశారు.

 దీంతో దేశ వ్యాప్తంగా ఇక్కడి జనసాంద్రత అక్కడే స్తంభించిపోయింది.దీంతో పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి నటువంటి జనాలు రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఎక్కడివారు అక్కడే నిలిచి పోవాల్సి వచ్చింది.

అయితే దగ్గర దగ్గర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఏదో అవస్థలు పడి తమ ఇళ్లను చేరుకున్నప్పటికీ దూర ప్రాంతాలకు వెళ్లినటువంటి వారు మాత్రం చేసేదేమీలేక వారు ఎక్కడికక్కడే నిలిచి పోయారు.దీంతో సరైన వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అలాంటి వారికోసం రైల్వే శాఖ శుభవార్త తొందర్లోనే శుభవార్త చెప్పనుంది.అయితే ఇటీవలే రైల్వే శాఖ చెందినటువంటి ఓ ఉన్నతాధికారి ఈ నెల 15వ తారీకు నుంచి రైల్వే బుకింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలిపారు.

Advertisement

అయితే ప్రస్తుతానికి ఈ సమాచారం తాత్కాలికమైన ప్పటికీ తొందర్లోనే అధికారిక ప్రకటనను వెల్లడించినట్లు సమాచారం.అయితే ఈ లాక్ డౌన్ కార్యక్రమం కూడా 14వ తారీకుతో ముగియనుండడంతో రైల్వే శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో దూర ప్రాంతాలకు పనుల నిమిత్తం వెళ్ళినటువంటివాకి ఉపశమనం కలిగినట్లుగా అయింది.అయితే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఇలా లాక్ డౌన్ కార్యక్రమం చేపట్టడం సరికాదని అంటున్నారు మరికొందరు.

చదువులు, ఉద్యోగాలు, వ్యాపార పనులు అంటూ పట్టణాల్లో నివసించే జనం తమ సొంత గ్రామాలకు చేరలేక, తాము ఉంటున్న టువంటి ప్రాంతంలో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మరి కొందరు వాపోతున్నారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు