తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ షీలా పెళ్లి అయ్యింది.చెన్నైలో సంతోష్ రెడ్డితో ఈ అమ్మడి వివాహం జరిగింది.
షీలా పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు మరియు మిత్రులు మాత్రమే హాజరయ్యారు.సినీ వర్గాల వారికి పెద్దగా ఆహ్వానాలు అందినట్లుగా లేదని సమాచారం అందుతోంది.
సినీ పరిశ్రమకు చెందిన వారు ఎవరు వెళ్లక పోవడంతో షీలా పెళ్లి గురించి మీడియాలో ప్రముఖంగా వార్తలు ప్రసారం కాలేదు.దాంతో కాస్త ఆలస్యంగా పెళ్లి గురించి మీడియాలో హడావుడి మొదలైంది.

తెలుగులో పరుగు, అదుర్స్, మస్కా, పరమవీరచక్ర చిత్రాలతో పాటు పలు చిత్రాల్లో నటించింది.ఒకటి రెండు సక్సెస్‌లు పడ్డా కూడా కంటిన్యూస్‌గా ఫ్లాప్స్ ఈమెకు పడటంతో కెరీర్ ఖతం అయ్యింది.తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఈమె నటించింది.అక్కడ కూడా అంతంత మాత్రంగానే ఈమెకు క్రేజ్ దక్కింది.అక్కడ హీరోలు ఈమెను పట్టించుకోలేదు.దాంతో సినిమాలకు గుడ్ బై చెప్పింది.
కొన్ని సంవత్సరాల క్రితం సినిమాల నుండి దూరం అయిన షీలా చెన్నైలో వ్యాపారం నిర్వహిస్తూ వస్తుంది.సంతోష్ రెడ్డితో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ అమ్మడు ఎట్టకేలకు ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







