అమృతం అందరికి చేరేలా జక్కన్న ప్రమోషన్‌

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు అమృతం సీరియల్‌ను అంత ఈజీగా మర్చిపోరు.ముఖ్యంగా 1980 కిడ్స్‌కు అమృతం సీరియల్‌తో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు.

 Rajamouli Doing Promotions To Amrutham Serial-TeluguStop.com

బుల్లి తెర అప్పుడప్పుడే ఆరంభం అవుతున్న సమయంలో అమృతం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.ప్రతి వారం విభిన్నమైన కాన్సెప్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమృతంను మళ్లీ తీసుకు వచ్చేందుకు రెడీ చేస్తున్నారు.

ఇన్నాళ్లు అమృతంను పాత ఎపిసోడ్స్‌నే చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్న ప్రేక్షకులకు కొత్త అమృతంను తీసుకు రాబోతున్నారు.

Telugu Amrutham, Gunduhanumantha, Lb Sri Ram, Zee Ott-Movie

అప్పటి కాన్సెప్ట్‌ మరియు అప్పటి నటీనటులనే ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నారు.ఆంజనేయులు పాత్రను అప్పుడు గుండు హనుమంతరావు చేశాడు.ఆయన మృతి చెందడటంతో ఆయన స్థానంలో ఎల్బీ శ్రీరామ్‌ను రంగంలోకి దించారు.

మిగిలిన వారు అంతా సేమ్‌ టు సేమ్‌.గెటప్స్‌ కూడా సేమ్‌గా కనిపించబోతున్నారు.

అయితే ఈసారి టీవీలో కాకుండా జీ5 ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌పై స్ట్రీమ్‌ కాబోతుంది.ఇప్పటికే అమృతం 2 కు బాగా పబ్లిసిటీ దక్కింది.

ఇప్పుడు అమృతం 2 కు పబ్లిసిటీ చేసేందుకు రాజమౌళి రంగంలోకి దిగాడు.ఆయన తనకు అమృతంతో ఉన్న అనుబంధంను ఆ సీరియల్‌ అంటే తనకు ఉన్న అభిమానంను గురించి చెప్పేందుకు మీడియా ముందుకు రాబోతున్నాడు.

అమృతం సీరియల్‌ను మరింత మందికి చేరువ అయ్యేలా చేసేందుకు దర్శకుడు రాజమౌళి వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక రేంజ్‌లో ఈ రెండవ పార్ట్‌కు కూడా స్పందన వచ్చే అవకాశం ఉందని నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube