రూటు మార్చిన మాస్ మహా రాజ్.. ఈసారైనా...

తెలుగులో స్వశక్తితో ఎదిగి నటువంటి హీరోల్లో మాస్ మహారాజ్ రవితేజ ఒకరు.

ఎప్పుడు విభిన్న కథనాలు ఎంచుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఇటు క్లాస్ అటు మాస్ ప్రేక్షకులను రవితేజ ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.

అయితే ఇటీవల కాలంలో రవితేజ తన చిత్రాలకు సంబంధించిన  కథల విషయంలో రూటు మార్చాడు.అయితే ఇందులో భాగంగా రవితేజ చిత్రపరిశ్రమలో తనతో సన్నిహితంగా ఉంటున్నవంటి కొంత మంది డైరెక్టర్లని కలిసి యాక్షన్ తరహాలో కాకుండా కామెడీ ఎంటర్టైనర్ తరహాలో ఉన్నటువంటి కథలను వినిపించ వలసిందిగా కోరాడట.

దీంతో ఇప్పటికే అనిల్ రావిపూడి హరీష్ శంకర్ దర్శకులు రవితేజ బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే కథలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.అంతేకాక ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్2 చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్3 చిత్రాన్ని కూడా పట్టాలు ఎక్కిస్తున్నాడు.

 ఇందులో భాగంగా  రవితేజని మూడవ హీరో పాత్రలో నటింపజేయడానికి ఇప్పటికే పలు చర్చలు కూడా జరుగుతున్నాయి.అయితే ఈ విషయానికి సంబంధించి తొందర్లోనే అనిల్ రావిపూడి అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

అయితే ఈ విషయం ఎలా ఉండగా ఇటీవల కాలంలో రవితేజ నటించిన టువంటి డిస్కో రాజా అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినా వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది.అయితే ప్రస్తుతం రవితేజ క్రాక్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ ఈ చిత్రానికి సంబంధించి టీజర్ కూడా విడుదలై మంచి ప్రేక్షకాదరణ సంపాదించింది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు