అవును... కమల్ హాసన్ నా అనుమతి లేకుండా ముద్దు పెట్టుకున్నాడు...

ప్రస్తుతం కోలీవుడ్లో కమల్ హాసన్ కి సంబంధించినటువంటి ఓ వార్త బాగా హల్చల్ చేస్తోంది.

అయితే విషయం ఇప్పటిది కాకపోయినప్పటికీ కమలహాసన్ చేసినటువంటి పనికి కోలీవుడ్ సినీ వర్గాలు బాగానే చర్చించుకుంటున్నారు.

అయితే ఇంతకీ విషయం ఏంటంటే అప్పట్లో తమిళ సీనియర్ నటి రేఖ మరియు కమల్ హాసన్ కలిసి "పున్నగాయ్ మన్నన్" అనే చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించారు.అయితే ఈ చిత్రంలో కమల్ హాసన్ ఓ సన్నివేశంలో నటి రేఖను గాఢంగా ముద్దు పెట్టుకుంటాడు.

అయితే ఈ విషయంపై ఇటీవల కాలంలో సీనియర్ నటి రేఖ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంటూ తన అనుమతి లేకుండానే కమలహాసన్ తనను ముద్దు పెట్టుకున్నాడని చెప్పుకొచ్చింది.అయితే ఈ ఈ విషయంపై పై టాలీవుడ్ ప్రముఖ సింగర్ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఒక హీరోయిన్ అనుమతి లేకుండా ఈ చిత్రంలో నటిస్తున్న సమయంలోనైనా లేదా బాహ్య ప్రపంచంలో నైనా ఎలా ముద్దు పెట్టుకుంటారని కమలహాసన్ పై మండిపడ్డారు.అంతేకాక ఈ విషయంపై సీనియర్ నటి రేఖకు కమలహాసన్ సారీ చెప్పాలని డిమాండ్ కూడా చేసింది.

Advertisement

దీంతో మరోసారి తమిళ వార్తల్లో నిలిచింది సింగర్ చిన్మయి.

అయితే తాజాగా ఈ వార్తలపై సీనియర్ నటి రేఖ స్పందించింది.ఇందులో భాగంగా అప్పట్లో తాను నటించిన  పున్నగాయ్ మన్నన్ అనే చిత్రంలో కమల్ హాసన్ తన అనుమతి లేకుండా పెదాలపై ముద్దు పెట్టుకున్నది వాస్తవమేనని అన్నారు.అంతేకాక ఈ చిత్రంలో నటించడానికి ముందు దర్శకుడు బాలచందర్ కూడా ఈ చిత్రంలో ముద్దు సీన్లు ఉంటాయని తనకు చెప్పలేదని అన్నారు.

ఒకవేళ ఈ చిత్రంలో ముద్దు సీన్లు ఉన్నాయని ముందే చెప్పి ఉంటే తాను ఆ చిత్రంలో నటించడానికి ఒప్పుకునే దాన్ని కాదని నటి రేఖ అన్నారు.అయినా ఇప్పుడు తాను ఎవరి నుంచి క్షమాపణలు ఎదురు చూడడం లేదని తనకు అంత అవసరం కూడా లేదని అన్నారు.

ఈ విషయాన్నిఇంతటితో వదిలేయాలని కోరారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు