అల వైకుంఠపురములో 41 రోజుల కలెక్షన్లు.. ఎంతో తెలుసా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అయ్యింది.

ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రొడ్యూస్ చేయడంతో ఈ సినిమాపై మొదట్నుండీ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాకు తొలిరోజే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.బన్నీ స్టైలిష్ యాక్టింగ్‌కు త్రివిక్రమ్ మార్క్ టేకింగ్ తోడవ్వడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దడదడలాడించింది.ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే రూ.100 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది.ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి 41 రోజులు దాటేసరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.159.90 కోట్ల మేర వసూళ్లు సాధించింది.బన్నీ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, హారికా అండ్ హాసిని రాధాకృష్ణ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.ఇక ఈ సినిమా 42 రోజుల కలెక్షన్లు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.నైజాం - 44.70 కోట్లు సీడెడ్ - 18.22 కోట్లు ఉత్తరాంధ్ర - 19.84 కోట్లు గుంటూరు - 11.14 కోట్లు ఈస్ట్ - 11.41 కోట్లు వెస్ట్ - 8.93 కోట్లు కృష్ణా - 10.76 కోట్లు నెల్లూరు - 4.71 కోట్లు టోటల్ ఏపీ+తెలంగాణ - 129.71 కోట్లు కర్ణాటక - 9.23 కోట్లు కేరళ - 1.17 కోట్లు రెస్టాఫ్ ఇండియా - 1.44 కోట్లు ఓవర్సీస్ - 18.35 కోట్లు టోటల్ వరల్డ్‌వైడ్ 41 రోజుల కలెక్షన్లు - రూ.159.90 కోట్లు.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు