పార్టీ నాయకులు అందరి సమస్యలు పరిష్కారం విషయంలోనూ చొరవగా నిర్ణయాలు తీసుకుంటూ పరిష్కార మార్గాలు వెతుకుతూ పార్టీని ముందుకు నడిపిస్తున్న తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఇప్పుడు ఓ కొత్త సమస్య వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.అది కూడా ఆయన సొంత ఇంటి నుంచే కావడం ఇక్కడ చర్చనీయాంశం అవుతోంది.
ఇంతకీ విషయం ఏంటంటే తెలంగాణ నుంచి రాజ్యసభకు రెండు స్థానాలు ఖాళీగా ఉండటంతో పార్టీ నాయకుల్లో తీవ్రమైన పోటీ నెలకొంది.ఈ రెండు ఖాళీలను కేసీఆర్ ఏ విధంగా భర్తీ చేస్తారనే ఆసక్తి కూడా అందరిలోనూ నెలకొంది.
కేసీఆర్ కుమార్తె కవిత ను రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం మొదలైంది.

కవిత రాష్ట్ర క్యాబినెట్ లో మంత్రి పదవి ఇస్తున్నార,ని ఆమెకు రాజ్యసభకు వెళ్లేందుకు ఇష్టం లేదు అని మరో ప్రచారం కూడా తెరమీదకు వచ్చింది.కానీ ఇప్పుడు కెసిఆర్ ఇంట్లో కవితకు రాజ్యసభ సీటు ఇచ్చే విషయంలో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.తెలంగాణ సీఎంగా కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ మంత్రి గా, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇప్పుడు నామినేటెడ్ కోటాలో ఆమెకు ఎంపీ పదవి ఇస్తే పార్టీ నుంచి, ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తాయని కేసీఆర్, కేటీఆర్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.బీసీ ఎస్సీ సామాజిక వర్గాల నుంచి ఈ రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాలని కెసిఆర్, కె టి ఆర్ భావిస్తుండగా కేసీఆర్ సతీమణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కవితకు రాజ్యసభ సీట్లు ఇవ్వాల్సిందే అంటూ పట్టుబడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

అసలు కేటీఆర్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినప్పుడే కవిత ఆ పదవిని ఆశించారు.కానీ కేసీఆర్ మాత్రం కేటీఆర్ వైపు మొగ్గు చూపడంతో రాజ్యసభ స్థానం కల్పిస్తారనే ఆశలో కవిత ఉన్నారు.కానీ ఇప్పుడు ఈ విధంగా చేయడంతో ఆమె మనస్తాపం చెందినట్లు పార్టీ కీలక నాయకులు చర్చించుకుంటున్నారు.అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది పక్కన పెడితే ఈ వ్యవహారం మాత్రం టిఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది.