వ్యాలెంటైన్స్ డే వస్తుంది అంటే ప్రేమికులు చాలా ప్లాన్స్ చేసుకుంటారు.ఆ రోజు తమ ప్రేమను చెప్పాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు.
కాని బయట కలిసేందుకు మాత్రం వారు భయపడుతూ ఉంటారు.ఎందుకంటే ఆరోజు భజరంగ్‌దళ్ మరియు వీహెచ్‌పీ వారు కనిపించిన జంటలకు రోడ్లమీదే వివాహం చేస్తూ ఉంటారు.
ప్రతి సంవత్సరం కూడా చాలా జంటలకు ఇలా పెళ్లిలు చేస్తూనే ఉంటారు.కాని ఇకపై ఆ పద్దతికి స్వస్థి చెప్పబోతున్నట్లుగా భజరంగ్‌దల్ మరియు విశ్వహిందూ పరిశత్ వారు ప్రకటించారు.
ప్రేమికుల దినోత్సవం అనేది హిందూ సమాజానికి మంచిది కాదని, ముఖ్యంగా ఇండియాలో దీన్ని కొనసాగించవద్దంటూ వారు కోరుతున్నారు.ఆ రోజున ఎప్పటిలాగే పార్క్ వద్ద, ప్రేమికులు కలిసే స్థలాల వద్ద అమరవీరుల ప్లెక్సీలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు.
ఎవరైనా ప్రేమికులు కనిపిస్తే అమరవీరులకు గట్టిగా నినాదాలు చెప్పించి వదిలి పెడతామని, దాడులకు పాల్పడవద్దంటూ కార్యకర్తలకు ముఖ్య నాయకులు సూచించారు.దాంతో ఈసారి ప్రేమికులు కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు
.