ఆర్కిమెడిస్ సూత్రం ఏనుగును కాపాడింది... ఎలానో తెలుసా...?

జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రమాదవశాత్తూ ఒక ఏనుగు బావిలో పడిపోయింది.ఆ ఏనుగును తీయడానికి అటవీశాఖ అధికారులు రకరకాల ప్రయత్నాలు చేశారు.

కానీ ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు.చివరకు ఆ ఏనుగును బయటకు తీయడం సాధ్యం కాదని ఆ ఏనుగుపై అటవీ శాఖ అధికారులు ఆశలు వదిలేసుకున్నారు.

కానీ ఊహించని విధంగా శాత్రవేత్త ఆర్కిమెడిస్ చెప్పిన సూత్రం గుర్తుకు రావడం ఆ సూత్రంను పాటించటంతో ఏనుగు ప్రాణాలతో బయటపడింది.భౌతిక శాస్త్రవేత్త ఆర్కిమెడిస్ సూత్రం ప్రకారం నీటిలో తక్కువ సాంద్రత ఉన్న వస్తువులు తేలుతాయి.

ఈ సూత్రాన్ని అనుసరించి అటవీ శాఖ అధికారులు బావిలో ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోశారు.ఆ బావిలో బురద ఎక్కువగా ఉంది.

Advertisement

బురద ఎక్కువగా ఉండటంతో ఏనుగు నీటిలో తేలింది.ఆ తరువాత నీటి స్థాయిని మెల్లమెల్లగా పెంచుతూ అటవీశాఖ అధికారులు పైకి తేలుతూ వచ్చిన ఏనుగును రక్షించారు.

ఎంతో శ్రమించి అటవీశాఖ అధికారులు ఏనుగు ప్రాణాలను కాపాడారు.పైకి తేలిన ఏనుగును బయటకు లాగటానికి అధికారులు వల సహాయం తీసుకున్నారు.

అటవీశాఖ అధికారులు తాము పాఠశాలలో చదివే సమయంలో ఈ సూత్రాలను నేర్చుకున్నామని అప్పుడు నేర్చుకున్న సూత్రాలు ఇలా పనికి వచ్చాయని చెబుతున్నారు.ఏనుగును ప్రాణాలతో కాపాడటంతో ఎంతో సంతోషంగా ఉందని చెబుతున్నారు.

సోషల్ మీడియాలో అధికారులు ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయగా సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఏనుగును కాపాడటంలో అధికారుల తెలివిని, ఆర్కిమెడిస్ సూత్రాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు