ఈ ఐసిస్ ఉగ్రవాది భారీకాయుడు: తలలు పట్టుకున్న సైన్యం, ట్రక్కులో జైలుకి

ఏదైనా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందితే ఆ ప్రాంతంలో పోలీసులో, మిలటరీయో స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తాయి.

కొందరిని మట్టుబెట్టి ప్రాణాలతో ఉన్న వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది.

అయితే ఓ ఉగ్రవాదిని తరలించడానికి ఇరాక్ సైన్యం అష్టకష్టాలు పడింది.వివరాల్లోకి వెళితే.

ఇరాక్, సిరియాల్లో యుద్ధకాండ నిర్వహిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాకు చెందిన కీలక వ్యక్తి ముఫ్తీ అబు అబ్ధుల్ బారీ.విద్వేషపూరితంగా ప్రసంగాలు ఇవ్వడంలో దిట్ట.

యువతను ఐసిస్ సానుభూతిపరులుగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.అలాగే జిహాదీలుగా మారి తదనంతరకాలంలో ఐసిస్‌కు వ్యతిరేకులుగా మారిన వారిని చంపేయాలని అబు ఫత్వాలు సైతం జారీ చేశాడు.

Advertisement

దీనితో పాటు ఐసిస్‌కు మద్దతుగా ఉండేందుకు నిరాకరించిన ఇస్లామిక్ గురువులను హతమార్చాలని కూడా ఆదేశాలిచ్చినట్లు అబుపై ఆరోపణలు ఉన్నాయి.ఇంతటి క్రూరుడి కోసం ఇరాక్ సైన్యం, సంకీర్ణ బలగాలు ఎప్పటి నుంచో గాలిస్తున్నాయి.

ఈ క్రమంలో ముఫ్తీ అబు అబ్దుల్ ఓ ప్రాంతంలో ఉన్నాడని తెలుసుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.కానీ అతని ఆకారాన్ని చూసిన వారు ఆశ్చర్యపోయారు.ఎందుకంటే అతని బరువు 560 పౌండ్లు (250 కిలోలు) ఇతగాడిని ఇక్కడి నుంచి ఎలా తరలించాలో తెలియక సైనికాధికారులు తలలు పట్టుకున్నారు.

చేసేది లేక చివరికి ఓ ట్రక్కును తీసుకొచ్చి జైలుకు తరలించారు.అబును జైలుకు తీసుకెళ్లే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.ఐసిస్ ఉగ్రవాదులు దేవుడిగా భావించే అబు అరెస్ట్ కావడాన్ని ముష్కరులు జీర్ణించుకోలేకపోతున్నారు.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు