వ్యభిచార కేంద్రంగా ఆర్మీ జవాన్ ఇల్లు... బట్ట బయలు చేసిన పోలీసులు  

Prostitution Racket Going On In Bsf Jawan\'s House - Telugu Bsf Jawan\\'s House, Meerut, Prostitution Racket

దేశంలో వ్యభిచార దందా, కాల్ గర్ల్స్ ర్యాకెట్ ఇప్పుడు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి.చట్టం కళ్లుగప్పి ఈ వ్యవహారాలని కొంత మంది చాలా సీక్రెట్ గా చేస్తున్నారు.

Prostitution Racket Going On In Bsf Jawan's House

టెక్నాలజీని వాడుకొని ఈ హైటెక్ వ్యభిచార దందాని నడిపిస్తున్నవారు ఉన్నారు.ఇక ఈ దందాలో ఈజీ మనీ కోసం కాలేజీ అమ్మాయిల నుంచి, మోడల్స్, హీరోయిన్స్ వరకు అందరూ ఉంటున్నారు.

అయితే ఇలాంటి వాటిలో కొన్ని భాగోతాలు బయట పడుతున్నాయి.తాజాగా యూపీలో మీరట్ లో ఓ వ్యభిచార దందా ని పోలీసులు క్రాక్ చేశారు.

స్తానికల సమాచారంతో మీరట్‌లోని ఓ ఇంట్లో దాడులు చేయగా, భారీ వ్యభిచార దందా బట్టబయలైంది.ఇద్దరు యువతులను, మరో ఇద్దరు విటులను వారు అరెస్ట్ చేశారు.దీనిలో డ్యాన్సర్ కూడా ఉంది.అయితే ఈ వ్యవహారానికి ఈ దందా నడుపుతున్న వారు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఆర్మీ అధికారిగా పని చేస్తున్న వ్యక్తి ఇంటిని కేంద్రంగా చేసుకోవడం విశేషం.

మూడు నెలల క్రితం ఆ ఆర్మీ జవాన్ కి పెద్ద ఎత్తున అడ్వాన్స్ చెల్లించి అద్దెకు తీసుకొని వ్యభిచారం మొదలు పెట్టారు.అందులోకి హర్యానాకు చెందిన డ్యాన్సర్‌ను కూడా తీసుకొచ్చారు.

స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఈ బండారం బయటపడింది.ఈ దందాలో అమ్మాయిలతో గడపడానికి విటుల నుంచి ఒక్కొక్కరి వద్ద 2 వేల నుంచి 3 వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలిసింది.

కాల్ గర్ల్స్ సమాచారం అంతా వాట్సాప్ ద్వారా కస్టమర్స్ కి పంపించి వారిని ఎట్రాక్ట్ చేస్తున్నట్లు తెలిసింది.అయితే ఈ వ్యవహారంలో ఆ ఆర్మీ జవాన్ కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది.