మోడీ ని కలిసిన కలక్షన్ కింగ్, పార్టీ మారబోతున్నారా

ప్రధాని నరేంద్ర మోదీ ని కలక్షన్ కింగ్ మోహన్ బాబు కుటుంబం తో సహా కలిసినట్లు తెలుస్తుంది.దాదాపు మోదీ తో అరగంట పాటు సమావేశమై చర్చలు జరిపినట్లు సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తన హవా చూపించాలని భావిస్తున్న ఈ తరుణంలో సినీ నటుడు,వైసీపీ నేత మోహన్ బాబు తో భేటీ అవ్వడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.2019 ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైసీపీ లో చేరిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా మోహన్ బాబు కోడలు వెరోనికా కూడా వైసీపీ అధినేత జగన్ కు బంధువు కూడా కావడం తో మోహన్ బాబు వైసీపీ లోనే కొనసాగుతారని అందరూ భావించారు.

అయితే ఇప్పుడు తాజాగా మోడీ తో మోహన్ బాబు భేటీ అయి అరగంట పాటు చర్చలు జరపడం తో త్వరలో ఆయన కాషాయ కప్పుకోనున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ.

ఓ ట్వీట్ చేశారు.డైనమిక్ లీడర్‌ను కలిశానని ట్వీట్‌లో కామెంట్ పెట్టారు.

దీన్ని బట్టీ మంచు ఫ్యామిలీ మొత్తం బీజేపీ గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు హీట్‌గా మారాయి.

Advertisement

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటడం, రాజధానిని అమరావతి నుంచీ వైజాగ్‌కి తరలించేందుకు సన్నాహాలు చేస్తుండటం వల్ల కృష్ణ, గుంటూరు జిల్లాల్లో రాజకీయాలు వేడెక్కాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు కూడా నిర్వహిస్తోంది.ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వారు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు.ఇలాంటి సమయంలో తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ మంచు వారి ఫ్యామిలీని ఆహ్వానించడం ద్వారా అటు ఏపీ, ఇటు తెలంగాణలో రాజకీయాల్ని ప్రభావితం చెయ్యాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరి మంచు వారి ఫ్యామిలీ కాషాయ కండువా కప్పుకుంటుందో లేదో చూడాలి.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు