బీసీజీ రిపోర్ట్... ఇది మరో జగన్ సొంత నివేదిక

రాజధాని మార్పు విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ చాలా స్పష్టమైన నిర్ణయంతో ఉన్నాకూడా ఏదో ప్రజలని డైవర్ట్ చేసే ఉద్దేశ్యంతో రాజధాని మీద బీసీజీ కమిటీ అంటూ ఒకటి, హై పవర్ కమిటీ ఒకటి వేశారు.

ఇప్పటికే జిఎన్ రావు కమిటీ అంటూ వేసి అది కూడా తాను తీసుకోబోయే నిర్ణయానికి అనుకూలంగా ఉండేలా చేసుకున్నాడని విమర్శలు ఎదుర్కొన్న జగన్ తాజాగా బీసీజీ రిపోర్ట్ తో కూడా విపక్షాలకి పని చెప్పాడు.

అమరావతిలో రాజధాని నిర్మాణం ఎంత వరకు శ్రేయస్కరం అనే విషయం మీద సర్వే చేసిన ఈ బీసీజీ కమిటీ తాజాగా తన నివేదికకి ముఖ్యమంత్రి జగన్ కి అందించినట్లు తెలుస్తుంది.ఇక ఈ నివేదిక ప్రకారం రాజధానిగా అమరావతి ఎంత ఉత్తమం కాదని, ఇక్కడ రాజధాని కోసం నిర్మాణాలు చేపట్టిన గోడకి వేసిన సున్నంలా ఏ మాత్రం పనికి రాకుండా పోతాయని చెప్పినట్లు తెలుస్తుంది.

అమరావతిలో భూమి సామర్ధ్యం ప్రకారం ఈ ప్రాంతంలో నిర్మాణాలు చేయడం అంత శ్రేయస్కరం కాదని, ఇక వేళ కట్టిన లక్షల కోట్లు వ్యయం అవుతుందని చెప్పినట్లు సమాచారం.ఇక అమరావతికి పెట్టిన పెట్టుబడిలో పది శాతం విశాఖలో పెడితే అద్బుతమైన పరిపాలన రాజధానిగా అభివృద్ధి చెందుతుందని చెప్పినట్లు తెలుస్తుంది.

అయితే బీసీజీ నివేదిక చూస్తూ ఉంటే అసెంబ్లీలో జగన్ ఏదైతే మాట్లాడాడో అలాగే అచ్చం ఉన్నట్లు రాజకీయ వర్గాలలో అప్పుడే చర్చ మొదలైంది.ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు చెప్పినట్లుగానే రాజధాని కోసం జగన్ ఎన్ని కమిటీలు వేసిన వారు ఏం చెప్పమంటే అదే చెబుతారు తప్ప అందులో పారదర్శకత ఉండదని విమర్శిస్తున్నారు.

Advertisement
ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు

తాజా వార్తలు