జబర్దస్త్‌కు పోటీగా వచ్చిన అదిరింది కామెడీ షోకు మొదటి వారంలో పర్వాలేదు అనే టాక్ వచ్చింది.ఆదివారం ప్రసారం అవుతున్న అదిరింది షో మొన్నటితో రెండవ వారం కూడా పూర్తి చేసుకుంది.
జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఈ అదిరింది కామెడీ షోకు రేటింగ్ యావరేజ్‌గా వచ్చింది.నెటిజన్స్ నుండి మంచి స్పందన వచ్చింది.
కాని ఆదివారం అయ్యేప్పటికి సినిమాలపై జనాలు ఎక్కువ ఫోకస్ పెట్టి అదిరిందిని తక్కువ చూసినట్లుగా అనిపిస్తుంది.

అదిరింది కామెడీ షోకు జబర్దస్త్ తో పోల్చితే చాలా తక్కువ రేటింగ్ వచ్చిందని బుల్లి తెర వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.జీ తెలుగులో ఇప్పటి వరకు చాలా షోలు వచ్చాయి.వాటితో పోల్చితే ఇది చాలా ఉత్తమ రేటింగ్ అంటూ కూడా బుల్లి తెర వర్గాల వారు అంటున్నారు.
అతి త్వరలోనే గురు మరియు శుక్రవారాల్లో ఈ షోను ప్రసారం చేయబోతున్నట్లుగా నాగబాబు ప్రకటించాడు.అందుకే అప్పుడు జబర్దస్త్‌ను ఢీ కొట్టబోతుంది.ఆ సమయంలో రెండింటిలో ఏది పవర్ ఫుల్ అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

రెండు వారాల కామెడీ స్కిట్స్‌ను పరిశీలిస్తే అదిరింది షో జబర్దస్త్‌ను దించేసినట్లుగానే ఉంది.కాని అనసూయ మరియు రష్మిల గ్లామర్ లేదు.కామెడీ మరియు ఇతర విషయాలు పూర్తిగా సేమ్ టు సేమ్ మెయింటెన్ చేస్తున్నారు.
హాట్ యాంకర్‌గా సమీరా ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తుంది.ఈమె ఇంకా రెండు మూడు వారాల వరకు సెట్ అయ్యే అవకాశం లేదనిపిస్తుంది.
జబర్దస్త్‌ను ఢీ కొట్టాలి అంటే అనసూయ లేదా రష్మిలను తీసుకు వచ్చి ఉంటే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







