కుర్రాళ్లు సరదాగా చేసే పనులు ప్రాణాల మీదకు తీసుకు వస్తాయి.ఆ విషయం ఎన్నో సార్లు నిరూపితం అయ్యింది.
అయినా కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు.వారు చనిపోవడమే కాకుండా ఇతరుల మరణంకు కూడా కారణం అవుతూ ఉంటారు.

రైలు ఫుట్ బోర్డ్‌పై నిల్చోవద్దని ఎన్ని సార్లు చెప్పినా కూడా కుర్రాళ్లు వినిపించుకోరు.అలా వినిపించుకోకుండా జారి పడ్డ వారు ఎంతో మంది ఉన్నారు.తాజాగా మరో కుర్రాడు కూడా రైలు ఫుట్ బోర్డ్‌పై నిల్చుని మరీ అతిగా ప్రవర్తించడంతో అతడు కాస్త జారి కింద పడ్డాడు.

ఇండియన్ రైల్వే విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఈనెల 26వ తారీకున ముంబయి లోకల్ ట్రైన్‌లో దిల్షాన్ అనే కుర్రాడు స్నేహితులతో కలిసి ఎక్కాడు.
ట్రైన్‌లో అతడు కూర్చుని ఉండకుండా ఫుట్ బోర్డ్ వద్ద నిల్చున్నాడు.అతడు కొద్ది సేపటి తర్వాత డోర్‌ను పట్టుకుని వేలాడుతూ ఫోజ్‌లు కొట్టడం మొదలు పెట్టాడు.అతడి చేష్టలను స్నేహితుడు వీడియో తీస్తూనే ఉన్నాడు.

కొద్ది సేపటి తర్వాత దిల్షాన్ ఏదో తగలడంతో కింది పడిపోయాడు.కింద పడ్డ దిల్షాన్ ప్లాట్ ఫామ్ మరియు రైలుకు మద్ద పడిపోయాడు.దాంతో అతడి శరీరం చిద్రం అయ్యింది.
రైలులో ఇలాంటి స్టంట్స్ చేయడం చట్ట విరుద్దం అంటూ చెప్పినా, కొంత మందికి శిక్షలు విధించినా కూడా దిల్షాన్ వంటి వారు మాత్రం మారడం లేదు.అతడి బలుపుకు అతడే శిక్ష అనుభవించాడు.
కాని అతడి తల్లిదండ్రులు పాపం ఏం తప్పు చేశారు.వారు ఒంటరి అనాధలు అయ్యారు.
అందుకే ఇలాంటి బలుపు పనులు చేసే సమయంలో కాస్త ఆలోచించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాం.







